సుప్రీం తీర్పు: నిర్భయ దోషులకు ఉరే సరి!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు.. జరిగిన దారుణంపై చట్టాన్ని తీసుకొచ్చిన ఉదంతంపై సుప్రీం తాజాగా కీలక తీర్పును ఇచ్చింది. దాదాపు ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కదులుతున్న బస్సులో నిర్భయ అనే పారా మెడికల్ విద్యార్థిని అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసిన వైనం తెలిసిందే.
ఈ ఉదంతం దేశం మొత్తాన్ని కదిలించింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి కూడా. ఈ దారుణానికి కారణమైన నిందితులకు సుప్రీంకోర్టు గతంలో ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో భాగమైన ఒక దోషి.. మైనర్ కావటంతో అతడ్ని పరిమితకాలానికి శిక్ష విధించారు. అయితే.. తమకు మరణశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోరుతూ సుప్రీంలో ఒక వాజ్యం దాఖలైంది.
ఈ నేపథ్యంలో స్పందించిన సుప్రీం నిర్భయ దోషులకు ఉరే సరైనదంటూ తమ తుది తీర్పును ఇచ్చింది. నిర్భయ దారుణంలో దోషులైన ముఖేష్ సింగ్.. అక్షయ్ ఠాకూర్.. వినయ్ శర్మ.. పవన్ గుప్తాలను నిందితులుగా ఉన్నారు. 2013 జనవరిలో ఈ గ్యాంగులో ఒకరిని మైనర్ గా జువైనల్ బోర్డు తేల్చింది. కాగా.. ముగ్గురికి మరణ శిక్ష విధించింది. వాస్తవానికి ఈ దోషులకు ట్రయల్ కోర్టులోనే ఉరిశిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు.
అయితే.. న్యాయం పేరుతో తమను హత్య చేస్తున్నారంటూ ముగ్గురు నిందితులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించింది.ఉరిశిక్షను విధించిన దోషులకు ఉరే సరి అంటూ తీర్పును ఇచ్చింది. క్షమించరాని నేరం చేశారని.. వీరికి ఉరిశిక్షను విధించాలని సుప్రీం ధర్మాసనం తీర్పును వెల్లడించింది.