దేశ ద్రోహం కేసులపై సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయం
దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్షన్ 124ఏ ప్రకారం కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. దేశద్రోహ చట్టాన్ని పున: పరిశీలిస్తామని కేంద్రం సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో అప్పటివరకూ కేసుల నిలిపివేత సాధ్యాసాధ్యాలపై ఆరాతీసింది.
కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశద్రోహ చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. అదే సమయంలో దేశద్రోహం చట్టంపై పున: పరిశీలన ప్రక్రియను 3-4 నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. దేశద్రోహం కింద నమోదైన పెండింగ్ కేసులపై కేంద్రప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని యోచిస్తుందనే విషయాన్ని వివరించాలని కోరింది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని సంప్రదించి బుధవారం స్పందన సమర్పించను్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.
కేంద్రం తరుఫున విచారణకు హాజరైన ఆయన.. కేసుల నమోదు తాత్కాలికంగా నిలిపివేయడంపై చర్చిస్తామని తెలిపారు. అనంతరం విచారణ బుధవారానికి వాయిదా పడింది.
అంతకుముందు రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అఫిడవిట్లో చట్టాన్ని సమర్థించిన కేంద్రం అనంతరం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. రాజద్రోహం చట్టంపై పునరాలోచన చేస్తామని సుప్రీం తెలుపడంతో కేంద్రం తన స్పందనను తెలియజేసింది. పున: పరిశీలన ప్రక్రియ ముగిసేవరకూ వ్యాజ్యాలపై విచారణ చేపట్టవద్దని అఫిడవిట్ లో పేర్కొంది.
‘వలస పాలకు నాటి రాజద్రోహం చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలను విస్తృత ధర్మాసనానికి నివేదించాలా? లేదా?’ అన్న అంశంపై ఈనెల 10న వాదనలు వింటామని ఇటీవల సుప్రీం వెల్లడించింది. దీనిపై గతవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై తన స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.