సీట్ల పెంపు అవసరమా-షాకింగ్ రియాక్షన్ !
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లను 816కు అలాగే దేశంలోని 4,123 అసెంబ్లీ సీట్లను 6,185కి పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి.;
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లను 816కు అలాగే దేశంలోని 4,123 అసెంబ్లీ సీట్లను 6,185కి పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. అలా ఎంపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ కేంద్రం ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. లోక్ సభ, శాసన సభ సెగ్మెంట్లను ఏకంగా 50 శాతం పెంపు చేయాలని ఆలోచన చేస్తున్నారు. దీని వల్ల ఏపీలో ఏకంగా 262-263కు అసెంబ్లీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే లోక్ సభ సీట్లు 37-38కి పెరుగుతాయి. ఇక తెలంగాణా అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి చేరుతాయి. ఎంపీ సీట్లు 17 నుంచి 26కి ఎగబాకుతంది.
ఎందుకొచ్చిన పెంపు :
ఇన్నేసి మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏముంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు నిర్వేదం ప్రకటిస్తున్నారు. అంతే కాదు షాకింగ్ రియాక్షన్ గా సీన్ ఉంది. ప్రజా ప్రతినిధుల జీత భత్యాలు వారికి అందించే సదుపాయాలు, ఇక అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటే చాలు జీవిత కాలం వారికి వారి జీవిత సహచరులకు ఇచ్చే పెన్షన్లు ఇతర సదుపాయాలు ఇవన్నీ తలచుకుంటున్న వారు ఇదంతా అధిక ఖర్చు తప్ప ఏముంటుంది అని అంటున్నారు.
ప్రజలే ప్రభువులు కానీ :
ప్రజా స్వామ్యంలో ప్రజలే ప్రభువులుగా ఉంటారు. కానీ వారి తరఫున పనిచేసే వారు మాత్రం అత్యంత ఖరీదైన వారుగా ఉండడమే తమాషా అంటున్నారు. ఇపుడు కాలం మారింది. అంతటా టెక్నాలజీ వచ్చేసింది. దాంతో ఎంత జనాభా ఉంటే అందరికీ ప్రజా ప్రతినిధులు అని దామాషా పద్ధతిలో పాత విధానంలో ఈ పునర్ విభజన చేయడం ఎందుకు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న చోట నుంచి కదలకుండా వర్చువల్ గా కూడా చర్చలు జరిపే రోజులు వచ్చేశాయని అంటున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులే కారు ఎవరి పాత్ర అయినా పరిమితం అవుతోంది అని గుర్తు చేస్తున్నారు.
స్థానికంగా వారు :
ప్రజలకు సేవ చేయడానికి వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ నుంచి క్షేత్ర స్థాయిలో ఎందరో అందుబాటులో ఉన్నారు కదా అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఈ అధిక పెంపు వల్ల ఉపయోగాలు కంటే నష్టాలే ఎక్కువ అని అంటున్నారు. అందరి కోసం ఉన్న అసెంబ్లీలు చాలవని, కొత్తగా కట్టించాలని అలాగే ఇతర ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టాలని ప్రోటోకాల్స్ ఇత్యాదివే అధికం అవుతాయని అంటున్నారు. ప్రజా ప్రతినిధులతో జనాలకు నేరుగా పని ఏముంటుంది అని కొత్త చర్చ వస్తోంది. లక్షల మందికి ఒకరు ఉన్న ఇద్దరు ఉన్నా ఒక్కటే కదా అని నిట్టూరుస్తున్నారు.
హద్దులు సరిహద్దుల గొడవలు :
ఎవరైనా తమ నియోజకవర్గం సమస్యలు తెలుసుకుని సభలో ప్రస్తావించి అధికారుల చేత పనులు చేయిస్తే చాలు అని అంటున్నారు. అలా కాకుండా నియోజకవర్గాలను ముక్కలు కొడితే హద్దులు సరిహద్దుల గొడవలు అలాగే వారి హవా వీరి పలుకుబడి అని కొత్త చిక్కులు సమస్యలు వచ్చి ఉన్న సమస్యలు మరింత జాప్యం కావడం తప్ప ఒరిగేది దక్కేది ఏముంది అని అంటున్నారు. రాజకీయ నిరుద్యోగానికి పరిష్కారం తప్పించి ఈ పెరుగుదల వల్ల జనాలకు సుతరామూ మేలు జరిగేది ఉండదని ఎక్కువ మంది నుంచి వస్తున్న అభిప్రాయం. అందువల్ల ఒకటికి పది సార్లు ఈ పెంపు మీద పెద్దలు ఆలోచిస్తే మంచిదేమో అని అంటున్నారు