జనసేనకు క్యూ స్టార్ట్ అంట...మ్యాటర్ అదే !

ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. అందులో టీడీపీ సీనియర్ మోస్ట్ పార్టీ. ఆ పార్టీలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నాయకులకు కొదవ లేదు.;

Update: 2026-03-25 03:35 GMT

ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. అందులో టీడీపీ సీనియర్ మోస్ట్ పార్టీ. ఆ పార్టీలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నాయకులకు కొదవ లేదు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో నలుగురైదుగురు ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉంటారు. దాంతో టీడీపీలో టికెట్ కోసం పోటీ తప్ప అభ్యర్థుల కొరత లేదు, ఇక వైసీపీ తీసుకుంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దాంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేపటి రోజున ఏమైనా జగన్ పాదయాత్రలో ఊపు కనిపిస్తే సీన్ మారుతుందని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ పార్టీగా ఉన్న పరిమిత పాత్ర ఏపీలో పోషిస్తోంది. దీంతో జనసేనకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడుతోంది అని అంటున్నారు.

స్వీట్ లాంట్ న్యూస్ :

దేశంలో సీట్ల పెంపు అన్నది పెద్ద ఎత్తున చర్చగా ఉంది. ఇక ఏపీలో అయితే ఆశావహులు ఎగిగి గంతు వేస్తున్నారు. తమ ఆశలు తీరుతాయని అవకాశాలు దక్కుతాయని వారు సంబరపడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న నేతలలో చాలా మంది వైసీపీని వీడిన వారు దూరం పాటిస్తున్న వారు ఉన్నారు. అలాగే వీరిలో అనేక మందిని టీడీపీ తీసుకోలేదు, తీసుకున్నా సీటు గ్యారంటీ ఉండదని అక్కడే కిక్కిరిసిపోయిన సీన్ ఉందని అంటున్నారు. దాంతో జనసేన బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది అందరికీ అని చెబుతున్నారు.

పొత్తులో భారీ సీట్లు :

ఏపీలో జనసేనకు పొత్తులో పెద్ద ఎత్తున సీట్లు ఈసారి దక్కుతాయని ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. ఏకంగా 269 దాకా ఏపీ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అలాగే 38 దాకా ఎంపీ సీట్లు పెరగనున్నాయి. దీంతో ఎమ్మెల్యే సీట్లు పొత్తులో జనసేనకు యాభై నుంచి డెబ్బై దాకా దక్కుతాయని అలాగే పది దాకా ఎంపీ సీట్లు లభించే సూచనలు ఉండొచ్చు అని అంచనా కడుతున్నారు ఈ క్రమంలో ఇప్పటి నుంచే జనసేనలో చేరి జనంలోనూ పార్టీ పెద్దల దృష్టిలోనూ ఉంటే కనుక టికెట్ తమకే దక్కుతుందని ఆ మీదట ఎంచక్కా ఎమ్మెల్యే ఎంపీ అయిపోవచ్చు అని చాలా మంది మాస్టర్ ప్లాన్ వేసుకుంటున్నారుట.

తెరిస్తే చాలు ఇక :

ఈ నేపధ్యంలో జనసేన తలుపులు తెరిస్తే చాలు ఇక లోపలికి దూసుకుని వచ్చేయడమే అని చాలా మంది నేతలు అనుకుంటున్నారని భోగట్టా. వీరిలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉండడం విశేషం. ఇప్పటిదాకా తమకు చేరిన పార్టీలో రాజభోగం దక్కలేదని భావించిన వారికి ఈ వార్తలు బంపర్ ఆఫర్ గా తోస్తున్నాయట. వారిని పట్టుకుని మరింత మంది నేతలు జనసేన వైపు వచ్చేందుకు చూస్తున్నారు అని అంటున్నారు.

పవన్ మార్క్ సమీక్ష :

ఇదిలా ఉంటే జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ తాజాగా మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో వారి సమస్యలు తెలుసుకున్నారు. జనాలకు చేరువగా ఉండాలని కోరారు. అంతే కాదు సీట్ల పెంపు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చిందని అంటున్నారు. రానున్న రోజులలో పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయని భవిష్యత్తు ఉంటుందని కూడా సమావేశంలో భావన వ్యక్తం అయింది అని అంటున్నారు. అందువల్ల అంతా కష్టపడి పనిచేయాలని అధినేత సూచించారు అని చెబుతున్నారు. మొత్తానికి జనసేన కండువాల కోసం తహతహలాడుతున్న జనాలు అయితే ఎక్కువ మందే ఉన్నారన్నది లేటెస్ట్ మ్యాటర్.

Tags:    

Similar News