పెళ్లి చేసుకోవాలని లేదు బ్రో... సిల్లీ రీజన్ అనుకోవద్దు !

ఈనాటి తరం పెళ్ళికి విముఖంగా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన సంగతే. ఎందుకంటే అది ఒక రొంపి అని వారి భావన.;

Update: 2026-03-25 03:29 GMT

ఈనాటి తరం పెళ్ళికి విముఖంగా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన సంగతే. ఎందుకంటే అది ఒక రొంపి అని వారి భావన. అంతే కాదు బాధ్యతలు బాధలు బంధీలు ఇలా ఏవేవో పెళ్ళి చుట్టూ అల్లుకుని ఉన్నాయి. అంతే కాదు పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, పందిళ్ళు సందళ్ళు ఇవన్నీ మోయలేని భారాలు బ్రో అని కూడా అంటున్నారు. పోనీ ఏదో మనసు అటు లాగి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటే ఈ దేశంలో కుదిరి చస్తోందా బ్రో అని మెట్ట వేదాంతం వల్లిస్తున్నారు. అయితే లోతుగా చూస్తే వారిది వేదాంతం కాదు వాస్తవమే అనిపిస్తోంది సుమీ. ఒకటి తరువాత ఒకటి తరుముకు వస్తున్న ప్రాబ్లంస్ తో పెళ్ళి ఆశ చచ్చిపోతోంది బ్రో అంటున్నారు. కరెక్ట్ గా దేశంలో ప్రతీ అయిదేళ్ళకూ ఒక ఉపద్రవం వస్తోంది అది నెలల తరబడి వీలైతే సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. దానినే సెటైరికల్ గా యూత్ చెబుతున్న తీరు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

నోట్ల రద్దుతో నాడు :

ఇప్పటికి సరిగ్గా పదేళ్ళ క్రితం 2016 నవంబర్ నెల చలి కాలం అందరికీ గుర్తుండే ఉంటుంది. హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు అన్నారు, దాంతో దేశమంతా ఆగిపోయింది. అది అతి పెద్ద ఆర్ధిక ప్రతిష్టంబనగా సాగింది. ఎన్నో పెళ్ళిళ్ళు నాడు పెట్టుకున్న వారు ఏమీ చేయలేకపోయారు. దాని మీద చూస్తే ఆనాడు ఇంట్లో పెళ్ళి ఉంది, గ్యాస్ కూడా ఉంది అతిధులు కూడా ఉన్నారు, కానీ పెద్ద నోట్ల రద్దు పుణ్యమాని ఇంట్లో నగదు లేదే అందుకే పెళ్ళి అయిదేళ్ళు వాయిదా వేశారుట నాటి యువత.

కరోనా మహమ్మారితో :

సరే అయిదేళ్ళు ఏ మాత్రం గిర్రున తిరిగాయి అనుకుంటే 2021 వచ్చింది. అందరికీ తెలుసుగా. అది కరోనా మహమ్మారి కాలం. కాలాన్ని బంతాట ఆడిన నరకం. భూ మండలం మీద ఒక్క మనిషి మీదనే పగబట్టిన యుగం. ఇలా కరోనా టైం లో చూస్తే అపుడూ ఇబ్బందే. ఇంట్లో ఇంట్లో పెళ్లి ఉంది, నగదు ఉంది,గ్యాస్ ఉంది కానీ అతిథులు లేరు, సో పెళ్ళి క్యాన్సిల్ బ్రో. అలా 2021లో అయిందన్న మాట

గల్ఫ్ యుద్ధం మంటలు :

ఇక ఇపుడైనా అంతా కుదుటపడి పెళ్ళికి రెడీ అంటూ అన్నీ చూసుకుంటే తెలుసుగా 2026 అంటే అందరికీ గుర్తుండిపోయేలా గల్ఫ్ యుద్ధం ఒక్కసారిగా వచ్చి పడింది. ఇపుడు చూసినా అదే కధ, అదే వ్యధ. అదే సీన్. ఇపుడు చూసినా ఇంట్లో పెళ్లి ఉంది; నగదు ఉంది, అతిథులు ఉన్నారు కానీ గ్యాస్ లేదే అంటూ రోదిస్తున్నారు. ఈసారి కూడా పెళ్ళి క్యాన్సిల్ అన్న మాట. పోనీ తరువాత అయిదేళ్ళకు అయినా పెళ్ళి వాయిదా వేసినా అవుతుందా అన్నది అతి పెద్ద డౌటే మరి.

అంతా అయిపోతుందిగా :

ఎందుకంటే 2031 నాటికి ఇంట్లో నగదు ఉంటుంది, అతిథులు ఉంటారు, గ్యాస్ ఉంటుంది. పైగా ఎలక్ట్రిక్ స్టవ్ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ పెళ్లి లేదు ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయింది బ్రో. ఇలా సోషల్ మీడియాలో యూత్ కామెంట్స్ చేస్తోంది. కరెక్ట్ గా అయిదేళ్ళకు ఒకమారు వచ్చి పడుతున్న సంక్షోభాలు అన్నీ పెళ్ళికి గుడ్ బై కొట్టించడమే కాదు, బతుకుకే బై బై చెప్పేలా ఉన్నాయని అంటున్నారు. చిత్రమేంటి అంటే ఇందులో అన్నీ మానవ ప్రయోగాలే, మానవ ప్రమేయాలే. అందుకే మరో ప్రమాదాన్ని మనిషి తీసుకుని రాడని నమ్మకం లేదు బ్రో అంటున్నారు.

Tags:    

Similar News