రాజస్థాన్: గెహ్లాట్ సర్కార్ కు సుప్రీం షాక్
రాజస్థాన్ అసమ్మతి సెగ ఎపిసోడ్ లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సర్కార్ కు షాక్ తగిలింది. సచిన్ పైలెట్ సహా అసంతృప్తి ఎమ్మెల్యేల పిటీషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్థాన్ హైకోర్టును నిలువరించలేమని సర్వోన్నత న్యాయస్తానం గురువారం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదలాయించాలని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాలను అణిచివేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంటూ పైలట్ సహా 19మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసుల జారీకి కారణాలను వివరించాలని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని వివరణ కోరింది. అయితే స్పీకర్ జోషి తరుఫున వాదనలు వినిపిస్తూ సొంత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నారని వాదించారు.
అయితే ఈ ఎమ్మెల్యేలు ఎన్నికైన ప్రజాప్రతినిధులని ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం అభిప్రాయపడింది. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత ప్రక్రియ అనుమతించదగినదా.. కాదా అనేది నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అనర్హత నోటీసులపై కోర్టులు జోక్యం చేసుకోజాలవని వాదించారు.