ఆసుపత్రిలో

Update: 2021-04-19 06:07 GMT
ఐపీఎల్ 2021 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో హ్యాట్రిక్ ఓటములని మూటగట్టుకున్న సన్ ‌రైజర్స్ హైదరాబాద్‌ కు మరో భారీ షాక్. ఆ జట్టు బౌలింగ్ కోచ్, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ ఆసుపత్రి పాలయ్యాడు. అతని గుండె రక్తనాళాల్లో  పూడిక ఉన్నట్లు గత మార్చిలోనే గుర్తించిన వైద్యులు.. తాజాగా ఆ పూడికని తొలగించడానికి యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఈ సర్జరీ జరిగినట్లు వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మురళీధరన్ మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతాడని సమాచారం.

అయితే మురళీ ధరణ్ సర్జరీ విజయంపై సన్ ‌రైజర్స్ టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  మురళీధరన్... 2015 నుంచి IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి కోచ్‌గా ఉంటున్నారు. ఆ టీమ్ బలాబలాలన్నీ ఆయనకు తెలుసు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీం కి ఇది మరో షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. సర్జరీ కారణంగా మురళీధరన్ ముంబైతో మ్యాచ్‌‌కు మురళీధరన్ దూరంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఏ మాత్రం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలకు తోడు ఆటగాళ్ల గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే కేన్ విలియమ్సన్ గాయంతో బెంచ్ ‌కే పరిమితం అవుతుండగా.. తాజాగా నటరాజన్ కూడా ఆ లిస్ట్‌లో చేరాడు. ఇప్పుడు కీలక కోచ్ అయిన మురళీ ధరన్ ఆసుపత్రిపాలయ్యాడు. ఇక తమ తదుపరి మ్యాచ్‌ లో సన్‌రైజర్స్.. పంజాబ్ కింగ్స్‌ తో తలపడనుంది.  టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ఘనత ముత్తయ్యదే. ప్రపంచంలో మరే ప్లేయర్ ఇన్ని వికెట్లు తియ్యలేదు. అందువల్ల ఆ రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది.  ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో మురళీధరన్ వేసే బౌలింగ్ దూస్రా  కూడా ఓ పార్ట్ అయిపోయింది.
Tags:    

Similar News