• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘బీసీసీఐ’ ఇదేంతీరు?...

‘బీసీసీఐ’ ఇదేంతీరు? పితృత్వ సెలవులు కోహ్లికేనా? నటరాజన్​కు ఇవ్వరా? గవాస్కర్​ కామెంట్స్​

By - Tupaki Desk
Update: 2020-12-24 09:46 GMT
బీసీసీఐ తీరును టీమిండియా మాజీ క్రికెటర్​ సునీల్​ గవాస్కర్​ తీవ్రంగా తప్పుపట్టారు. బీసీసీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. టీం ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ భార్య అనూష్క ప్రస్తుతం గర్భిణి. ఆమె జనవరి మొదటివారంలో బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఈ క్రమంలో బీసీసీఐ విరాట్​ కోహ్లీకి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. అతడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్​ సీరిస్​ను వదిలేసి ఇండియాకు పయనమయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది.

అయితే సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరఫున ఆడి.. ప్రస్తుతం టీంఇండియాకు ఎంపికైన నటరాజన్​ భార్య కూడా నటరాజన్​ ఐపీఎల్​లో ఆడుతున్నప్పుడే ప్రసవించింది. అతడికి అమ్మాయి పుట్టింది. అయితే ఆ టైంలో నటరాజన్​కు బీసీసీఐ సెలవు మంజూరు చేయలేదు. మరోవైపు అతడిని యూఏఈ నుంచి ఆస్ట్రేలియా టూర్​కు ఎంపిక చేసి.. ఆస్ట్రేలియా ఫ్లైట్​ ఎక్కించారు. అయితే ఇప్పటివరకు నటరాజన్​ తన పాపను చూసుకోలేదు. ఈ క్రమంలో గవాస్కర్​ బీసీసీఐపై మండిపడ్డారు. బీసీసీఐ నటరాజన్​కు ఓన్యాయం.. విరాట్​ కోహ్లీకి మరో న్యాయం చేసిందని ఆయన ఫైర్​ అయ్యారు. బుధవారం ఓ మీడియా చానల్​కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సన్నీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

యువ బౌలర్‌ టీ నటరాజన్‌ భార్య పాపకు జన్మనిచ్చినా.. అతడికి ఎందుకు సెలవులు ఇవ్వలేదంటూ గవాస్కర్​ పేర్కొన్నారు. ఒకే టీమ్‌లో ఉన్న కోహ్లీ, నటరాజన్‌ని వేర్వేరుగా చూడటం టీమిండియా మేనేజ్‌మెంట్‌కే చెల్లిందని సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. గతంలో స్పిన్నర్‌ ఆర్ అశ్విన్‌ ఒక్క మ్యాచ్‌లో రాణించకపోయినా పక్కన పెట్టారని.. అదే బ్యాట్స్‌మెన్‌ విషయంలో అలా చేశారా అని సన్నీ ప్రశ్నించారు.
Tags:    
  • BCCI 
  • Sunil Gavaskar 
  • Petarnati Leaves 
  • Kohli 
  • Natarajan 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS