సుందర్ పిచాయ్ పంచసూత్ర

Update: 2015-12-16 09:21 GMT
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్లో అత్యున్నత పదవి చేపట్టిన తర్వాత ఆయన జరుపుతున్న తొలి భారత్ పర్యటన ఇదే. తన పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖుల్ని కలుస్తున్న ఆయన.. ఈ సందర్భంగా ఐదు అంశాల్ని పదే పదే ప్రస్తవించటం గమనార్హం. తన తాజా పర్యటనలో భాగంగా ఇంటర్నెట్ ను మరింత వినియోగించేలా చేయటమే ఆయన లక్ష్యంగా చెబుతున్నారు.

సామాన్యుడి కూడా సాంకేతికతను పరిచయం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నది పిచాయ్ ఆలోచనగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. ఆయన ప్రస్తావిస్తున్న ఐదు అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సుందర్ పిచాయ్ ప్రస్తావిస్తున్న ఐదు అంశాల్ని చూస్తే..

1.     11 భాషల్లో టైప్ చేసేలా ఉపయోగపడే గూగుల్ ఇండిక్ కీ బోర్డు

2.     భారత్ కోసం తయారు చేసే ఉత్పత్తుల కోసం హైదరాబాద్ లో మరో కార్యాలయం ఏర్పాటు

3.     దేశంలో వంద రైల్వేస్టేషన్లలో రైల్ టెక్ సహకారంలో 2016 డిసెంబర్ నాటికి వైఫై సేవలు

4.     2016 నుంచి గూగుల్ సెర్చ్ ద్వారా లైవ్ క్రికెట్ అప్ డేట్లు

5.     రానున్న 3 ఏళ్లలో గ్రామాల్లో మహిళలకు భారీగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు సాయం

Tags:    

Similar News