సూర్యుడు మాయమైపోయాడు..2 నెలలపాటు కనిపించడు..ప్రపంచంలో విచిత్రమైన ప్రాంతమదే!

Update: 2020-11-20 14:50 GMT
ప్రతిరోజు మనకు సాయంత్రం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ప్రపంచంలోని ఓ దేశంలోనైనా కాస్త అటు ఇటుగా ఇదే సాయంత్రమే సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. మనకు పగలు ఉన్నప్పుడు.. అమెరికాలో రాత్రి ఉండొచ్చు. సమయాల్లో తేడాలు ఉండొచ్చు. కానీ ఓ చోట మాత్రం సూర్యోదయం జరిగిన కొన్ని గంటల్లోనే సూర్యాస్తమయం అయ్యింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మరో రెండు నెలల పాటు అక్కడ సూర్యుడే కనిపించడు.. వారికి ఇక అంతా చీకటే. ఈ విచిత్రమైన ప్రదేశం అమెరికాలో ఉంది.

అమెరికాకు ఉత్తర దిక్కున ఉన్న అలస్కాలోని ఉట్కియావిక్‌లో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చివరి సూర్యాస్తమయం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. మళ్లీ 2021, జనవరి 22న మాత్రమే అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు.

అంటే.. అక్కడ దాదాపు 65 రోజులు సూర్యుడే ఉండడు. అప్పటి వరకు అక్కడ పగలు కూడా ఉండదు. ఈ 2020 సంవత్సరానికి ఇదే చివరి సూర్యాస్తమయం. మనకు రాత్రి ఒక పూట మాత్రమే ఉంటుంది. కానీ, అక్కడ రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది. పగలు కూడా రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది. దీర్ఘ కాలికంగా ఉండే పగటి వేళల్లో జీవించడం సులభమే. కానీ, దీర్ఘకాలిక రాత్రిళ్లు జీవించడమే కష్టం. ఈ రాత్రులను అక్కడ ‘పోలార్ నైట్’ అని అంటారు.

ఇది సుమారు 320 కిమీలు విస్తరించి ఉంటుంది. ఆ ప్రాంతంలో 2 నెలలకు పైగా సూర్యుడే కనిపించడు. అయితే, మిగతా ప్రాంతాల్లో సూర్యోదయం వేళ కాస్త కాంతి వస్తుంది. కాబట్టి.. పూర్తిగా చీకటిగా కాకుండా వెన్నెల రాత్రిలా ఉంటుంది.

ఉట్కియావిక్‌‌లో నివసిస్తున్న @kirsten_alburg అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్.. చివరి సూర్యస్తమయాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో ఇది వైరల్‌గా మారింది. ఉట్కియావిక్‌‌కు నార్త్ పోల్‌లో ఉండటం వల్ల అక్కడ సుమారు 2 నెలలు సూర్యుడు కనిపించడని, ఆ కాలాన్ని చలికాలంగా పిలుస్తారు.

సూర్యుడు కనిపించే మిగతా రెండు నెలలను వేసవిగా పిలుస్తారు. వేసవిలో సూర్యస్తమయం, సూర్యోదయం వంటివి ఉండవు. సూర్యుడు 24X7 కనిపిస్తూనే ఉంటాడు.


Full View
Tags:    

Similar News