• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండోనేషియాలో వింత: గ‌ర్భం...

ఇండోనేషియాలో వింత: గ‌ర్భం దాల్చిన గంట‌కే ప్ర‌స‌వం

By - Tupaki Desk
Update: 2020-07-26 07:50 GMT
ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాలంటే 8 నుంచి 9 నెల‌లు త‌ప్ప‌నిస‌రిగా గర్భం ఉండాల్సిందే. పిండం నుంచి శిశువుగా రూపం దాల్చ‌డానికి ఆ స‌మ‌యం ప‌డుతుంది. గ‌ర్భంలో పిండం నుంచి బిడ్డ‌గా కావ‌డానికి 9 నెలల స‌మ‌యం. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం తెలిసిందే. అయితే ఇండోనేషియాలో మాత్రం విచిత్రం జ‌రిగింది. గ‌ర్భం దాల్చిన ఓ గంట‌లోనే ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతోపాటు శృంగారం లేకుండానే ఆ బిడ్డ పుట్ట‌డం మ‌రో విశేషం. సృష్టికి విరుద్ధంగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇండోనేషియాలోని మండలసరీ గ్రామంలో చోటుచేసుకుంది.

ఆ గ్రామంలో 30 ఏళ్ల హెనీ నురేని నివ‌సిస్తోంది. ఆమె శ‌రీరంలో గర్భానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అయితే జూలై 18వ తేదీ రాత్రి అకస్మాత్తుగా ఆమెకు వాంతులు అయ్యాయి. ఉన్నట్టుండి కడుపు ఉబ్బడం మొదలైంది. అనంత‌రం ఓ గంట తర్వాత తీవ్ర నొప్పులు వచ్చాయి. ఆ క్ర‌మంలోనే ఓ గంట‌కు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘ‌ట‌న ఆ దేశంతో పాటు సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్ అయ్యింది. అయితే మ‌రో విచిత్రం ఏమిటంటే.. ఆమె 19 నెలలుగా భర్తతో శృంగారంలో పాల్గొన‌లేదు. ఇలా విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంపై శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేస్తున్నారు.

హెనీకి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 9 నెలలుగా ఆమెకు రుతుస్రావం క్రమం తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ అది ఆగినా ఆమె గర్భవతి అనే విషయం తెలిసేది. 19 నెలలుగా శృంగారానికి దూరంగా ఉండ‌డం ఇలా ఏ విధంగా చూసినా ఆమెకు గ‌ర్భం రావ‌డానికి ఆస్కారమే లేదు. అయినా ఆమెకు ప్ర‌స‌వం కావ‌డం వింత‌గా మారింది. రెండో ప్ర‌స‌వం తర్వాత ఆమె అనారోగ్యం చెంద‌డంతో రెండేళ్లు సెక్సుకు దూరంగా ఉంటోంది. ఈ విషయం తెలిసి వైద్యులు.. మీడియా ఆమె వ‌ద్ద‌కు వెళ్ల‌గా ఆమె ఎలాంటి వివ‌రాలు చెప్ప‌డం లేదు. ఆమె త‌న‌ను వ‌దిలేయాల‌ని ప్రాధేయ‌ప‌డింది. దీంతో ఆమెతో ఎవ‌రూ మాట్లాడలేదు. అయితే ఈ ఘ‌ట‌న‌పై కొంద‌రు వైద్యులు కార‌ణాలు చెబుతున్నారు. కొందరు మహిళలు లక్షణాలు కనిపించకుండానే గర్భం దాల్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. దీనిపై అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు కొంద‌రు శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు.
Tags:    
  • Indonesia 
  • Indonesia Pregnancy 
  • Pregnancy Lady 
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS