మోడీ ప్రధాని కాకూడదని కాంగ్రెస్ తో కలిసిన వ్యక్తి చంద్రబాబు

Update: 2021-05-31 09:30 GMT
బీసీ సామాజికవర్గానికి చెందిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని కాకూడదని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన వ్యక్తి చంద్రబాబు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. బీసీలను అవమానించిన చంద్రబాబును ఎవరూ మరిచిపోరని అన్నారు.

ప్రధాని మోడీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడలో సోము వీర్రాజు పాల్గొన్నారు.

 ఊళ్లో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావుడి అన్నట్టు  సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.ఇప్పుడు కేంద్రానికి మద్దతిస్తానని చంద్రబాబు నాటకాలాడుతున్నారని దుయ్య బట్టారు. టీడీపీ, వైసీపీ రెండింటికి తాము సమదూరం ఉంటామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ఇటీవల మహానాడు సందర్భంగా చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలతో కలిసి పోరాడుతామన్నారు. జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామన్నారు. బీజేపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీనిపైనే సోము వీర్రాజు తాజాగా కౌంటర్ ఇచ్చారు.
Tags:    

Similar News