జగన్ పై దాడి...సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్!
విశాఖ ఎయిర్ పోర్టులో గురువారం నాడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత - వైసీపీ అధ్యక్షుడు జగన్ పై జరిగిన దాడి ఘటనను పలువురు నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. ఏపీ - తెలంగాణలోని నేతలంతా జగన్ కు సంఘీభావం తెలిపారు. కానీ, ఏపీలోని టీడీపీ నేతలు మాత్రం...ఈ దాడి ఘటనను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడికి గురైన జగన్ పై మాటవరసకు సానుభూతి చూపుతూనే...మరోవైపు అవాస్తవ ఆరోపణలతో దాడి చేస్తున్నారు. తాజాగా జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడి వెనుక చంద్రబాబు ఉన్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. రెస్టారెంట్ లో పనిచేసే పిల్ల కుంకతో జగన్ హత్యను చంద్రబాబు ప్లాన్ చేయించరని - ఒకవేళ తాము నిజంగా ప్లాన్ చేస్తే ఇలా గిచ్చుకోవటాలు గుచ్చుకోవటాలు ఉండవని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్లాన్ చేయాలనుకుంటే రాజారెడ్డి - వైఎస్ - జగన్ తరహాలోనే ప్లాన్ చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, టీడీపీ నేతలు అటువంటి దాడులకు పాల్పడే రకం కాదని అన్నారు.
జగన్ కు అరసెంటీమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చెయ్యాలా? అని సోమిరెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించారు. దాడి విషయంలో కేంద్రాన్ని జగన్ ఏమీ అనడం లేదన్నారు. విశాఖలో కుట్లు వేసే డాక్టర్లు లేక జగన్ హైదరాబాద్ వరకు వెళ్లాలా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో చీపురుపుల్ల కూడా గుచ్చుకోలేదని - కేంద్ర పరిధిలోని విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిందని అన్నారు. కేంద్రం అమలు చేసిన డ్రామాలో సీఐఎస్ ఎఫ్ కూడా సహకరించిందా అని సోమిరెడ్డి కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చంద్రబాబు నిజంగా ప్లాన్ చేస్తే..జగన్ బ్రతికి ఉండేవారు కాదని అర్థం వచ్చేలా సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతల క్రిమినల్ ఆలోచనలను సోమిరెడ్డి బయటపెట్టారని విమర్శిస్తున్నారు. మంత్రి హోదాలో ఉన్న సోమిరెడ్డి ...ఈ వ్యాఖ్యలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.