సోషల్ మీడియా రెచ్చిపోయింది

Update: 2016-11-09 02:34 GMT
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. సోషల్ మీడియాలో సామన్య ప్రజలు దీనిపై ఒక రకంగా సంబరాలే జరుపుకొన్నారని చెప్పాలి. తమలోని కామెడీ యాంగిల్ ను చూపిస్తూనే మోడీపై ప్రశంసలు కురిపించారు.

సోషల్ మీడియా సెటైర్లు ఇలా..

- ఛానళ్లు, పత్రికలు అమెరికా ఎన్నికల కోసం అంతా ప్రిపేరై వచ్చాయి. కానీ, మోడీ సిలబస్ లో లేని ప్రశ్నలా వచ్చి పడ్డారు.

- అమెరికాలో ఓట్లు లెక్కపెడుతుంటే... ఇండియాలో నోట్లు లెక్క తేల్చుతున్నారు..

- డిసెంబరు 30లోగా మార్చుకోకపోతే 500, 1000 నోట్ల భవిష్యత్ ఇదీ అంటూ పలు చిత్రాలు పెట్టారు. మేకలకు ఆహారంగా పెట్టినట్లు... పల్లీలు తినే పొట్లంగాను... చివరికి టాయిలెట్ పేపర్ గానూ చూపుతూ సోషల్ మీడియాలో చిత్రాలు హల్ చల్ చేశాయి.

- ఎక్స్లూజివ్ పిక్చర్సు ఆఫ్ బ్లాక్ మనీ హోల్డర్సు అంటూ ఏడుస్తున్న ఫొటోలను షేర్ చేశారు.

- రజనీకాంత్, శివాజీల కాంబినేషన్లో వచ్చిన శివాజీ సినిమాలా ఉందంటూ మరికొందరు సినిమాటిక్ గా చెప్పారు.
Tags:    

Similar News