స్మార్ట్ ఫోన్‌ తోనే వీర్య పరీక్ష చేసేసుకోవ‌చ్చు!

Update: 2017-03-24 05:09 GMT
టెక్నాల‌జీ ఫ‌లాల‌తో వైద్య ప‌రీక్ష‌లు అంటే ఆస్ప‌త్రికే వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా పోతోంది. ఇలాంటిదే ఈ వార్త‌. స్మార్ట్‌ ఫోన్ సాయంతో పురుషుల వీర్యాన్ని పరీక్షించి విశ్లేషించగలిగే చిన్న పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకుల బృందం దీనిని రూపొందించింది. వీర్యాన్ని విశ్లేషించే సదుపాయాలు లేని దేశాల్లో ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరికరాన్ని పనిచేయించేందుకు ప్రత్యేక యాప్‌ ను రూపొందించారు.

ఈ వినూత్న యాప్ ఎలా ప‌నిచేస్తుందంటే...చిన్న ట్రేలో వీర్యాన్ని నింపి పరికరంలో అమర్చిన తర్వాత దానిని స్మార్ట్‌ ఫోన్‌ కు అనుసంధానిస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా దానిని విశ్లేషిస్తే వీర్యకణాల సంఖ్య తెలుస్తుంది. ఎవరికి వారే సొంతగా పరీక్ష జరుపుకొనేలా యాప్ సహకరిస్తుంది. పరిశోధకులు ఇప్పటివరకు దాదాపు 350 నమూనాలను పరీక్షించి చూడగా 98 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయి. ఈ విధానం వల్ల ఖర్చు తగ్గుతుందని, సమయం ఆదా అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News