ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం

Update: 2021-03-05 04:22 GMT
ఏపీ సీఎం జగన్ ప్రకటించిన ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యత్వాలకు నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు వైసీపీ అభ్యర్థులు పోటీ లేకుండానే ఎన్నికవ్వడం విశేషం. ఈ ఆరుగురు మినహా ప్రతిపక్ష టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వీరి ఎన్నిక సంపూర్ణమైంది.

వైసీపీ అభ్యర్థులు మహ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, బల్లి కల్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, సి.రాంచంద్రయ్యలు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. గురువారం ఆఖరి రోజు వరకు వీరిపై పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఈ క్రమంలోనే గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వీరంతా పార్టీ బీఫాం అందుకున్నారు. మంత్రులు బొత్స, బుగ్గన పాల్గొన్నారు.

మండలిలో ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు గెలవడంతో అధికార పార్టీ వైసీపీ బలం 18కి చేరింది. ప్రస్తుతం మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 26, డెమొక్రాట్ ఫ్రంట్ సభ్యులు 5, బీజేపీ, స్వతంత్రులు, ఖాళీలు మూడేసి చొప్పున ఉన్నారు. 
Tags:    

Similar News