భార్యాభర్తలకు భారీ ఊరటగా నిర్మలమ్మ బడ్జెట్
భార్యాభర్తలకు భారీ ఊరటను ఇచ్చేలా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందుతుందని అంటున్నారు.;
భార్యాభర్తలకు భారీ ఊరటను ఇచ్చేలా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందుతుందని అంటున్నారు. ఈ బడ్జెట్ లో దంపతులకు ఎంతో ఉపశమనం కలిగించే అంశాలను చేరుస్తారని అంటున్నారు. దాంతో వారి ఆదాయం పదిలంగా ఉంటుందని పన్ను పోటు కూడా తగ్గుతుందని అంటున్నారు. ఇక చూస్తే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు
ఫ్యామిలీ యూనిట్ గా :
నిర్మల బడ్జెట్ లో ఫ్యామిలీని యూనిట్ గా తీసుకుని ఆదాయ పన్ను విధానంలో సవరణలు ఉంటాయని అంటున్నారు. అంటే ఒక కుటుంబంలో భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఆదాయం సంపాదిస్తూంటే ఇప్పటిదాకా ఇద్దరూ పన్నులు చెల్లించేవారు. ఈసారి బడ్జెట్ లో ఆ విధంగా కాకుండా ఇద్దరికీ కలిపి ఒక యూనిట్ గా తీసుకుని జాయింట్ గానే పన్ను విధానం పెడతారని దాంతో భారీగా ఆదాయం పన్ను చెల్లించడం తగ్గుతుందని అంటున్నారు. ఇది మధ్యతరగతి జంటలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. వారికి వచ్చే ఆదాయంలో పన్ను చెల్లింపుకే అంతా పోతోంది అన్నది కూడా బెంగ ఉండదని చెబుతున్నారు.
ఇతర దేశాలలో ఉన్నట్లుగా :
ఇక దేశంలో చూస్తే చాలా చోట్ల మధ్యతరగతి కుటుంబాలలో భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కానీ గడవని పరిస్థితి ఉంది. అలాంటిది ఆదాయం పన్ను ఇద్దరూ కడితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. దాంతో ఈ జాయింట్ టాక్స్ విధానాన్ని దేశంలో తొలిసారిగా అమలు చేయబోతున్నారు అని అంటున్నారు. ఈ విధానం అయితే ఇతర దేశాలలో ఉందని గుర్తు చేస్తున్నారు. వాటిని అధ్యయనం చేసిన మీదటనే కేంద్ర ప్రభుత్వం దంపతులకు భారీ ఊరటను ఇచ్చేలా పన్ను విధానంలో మార్పులు చేస్తోంది అని అంటున్నారు. దీని పేరు ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ గా పెడుతున్నారు. ఈ విధానం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు ఆదాయాని ఉమ్మడిగా పరిగణించి ఆదాయం పన్ను ఆ విధంగా లెక్కిస్తారు.
ఆర్ధికంగా మేలు :
ఈ ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానం ద్వారా మొత్తం జంటలను అందరినీ కలిపి పన్ను చట్రంలోకి తీసుకుని రావచ్చు. భారీ ఊరట ఉండడం వల్ల సహజంగానే అందరూ పన్ను చెల్లింపునకు ముందుకు వస్తారు. తద్వారా పన్ను ఎగవేసే విధానాలకు చెక్ పడుతుంది. అలా కేంద్ర ఖజనాకు భారీగానే ఆదాయం వస్తుంది. అదే సమయంలో ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ తో ఇద్దరూ పన్నులు చెల్లిస్తున్న వారికి ఆ భారం బాగా తగ్గుతుంది. దాంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి పన్నుల సంస్కరణలో దీనిని పెద్ద పీట వేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఉద్యోగ దంపతుల విషయంలో నిర్మలమ్మ దీవెనలు ఏ విధంగా ఉంటాయో.