ఏపీలో ఆ రెండు నగరాలు టాప్

ఏపీలో రెండు నగరాలు టాప్ టెన్ లో ఉన్నాయి. ఇది నిజంగా అంతా ఆనదించే విషయం. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టమైంది.;

Update: 2026-01-29 23:30 GMT

ఏపీలో రెండు నగరాలు టాప్ టెన్ లో ఉన్నాయి. ఇది నిజంగా అంతా ఆనదించే విషయం. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఆర్థికంగా ఎంతో ప్రగతి కనిపిస్తోంది. అలాగే ద్రవ్యోల్బనం తగ్గిందని అన్ని విషయాల్లో ఇతర రాష్ట్రాలతో ఏపీ తెలంగాణా పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయని ఆర్థిక సర్వేలో పేర్కొనడం శుభ పరిణామంగా చెబుతున్నారు.

దూసుకుపోతున్న నగరాలు :

ఏపీలో తిరుపతి, విజయవాడ నగరాలు అభివృద్ధిలో దూసుకుని పోతున్నాయని ఆర్ధిక సర్వే స్పష్టం చేసింది. జీవన ప్రమాణాలు బాగుండి అంతా కలసి జీవించే యోగ్యంగా ఉండే నగరాలలో దేశంలో టాప్ టెన్ ని ఆర్ధిక సర్వే గుర్తిస్తే అందులో ఏపీ నుంచి ఈ నగరాలు ఉండడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇక హైదరాబాద్ తరువాత విజయవాడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందడం మరో కీలక పరిణామంగా ఉంది. అంతే కాదు 2031 నాటికి హైదరాబాద్ జీడీపీ 201.4 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని, అదే సమయంలో విజయవాడ జీడీపీ 21.3 బిలియన్ డాలర్లకు ఎగబాకే అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది.

అమరావతి ప్రస్తావన :

ఇక కేంద్ర ఆర్ధిక సర్వేలో అమరావతి రాజధాని గురించి కూడా ప్రస్తావన ఉంది. ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని భవిష్యత్తులో కూడా అది మరింత వేగంగా సాగేలా కొత్త నగరాల నిర్మాణం సాగుతోందని ఆర్ధిక సర్వే గుర్తు చేసింది. అంతే కాకుండా అమరావతి రాజధాని హరిత నగరంగా నిర్మాణం చేస్తున్నారని తెలిపింది. అమరావతికి ఎన్నో మంచి అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని కూడా ఈ ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది.

బిజినెస్ లోనూ టాప్ :

ఇక ఏపీ వాణిజ్య ఒప్పందాలు కార్యకలాపాల్లో కూడా చాలా ముందు ఉందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. ఏపీలో పెద్ద ఎత్తున వాణిజ్య సంస్కరణలు చేపడుతున్నారని దాంతో మెరుగైన వాణిజ్య వాతావరణం ఆ రాష్ట్రంలో ఏర్పడింది అని వెల్లడించింది. సింగిల్ విండో విధానం అమలు చేయడం అన్నది ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో చేయూతను ఇస్తోందని తెలిపింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే కనుక అతి పెద్ద బల్క్ డ్రగ్ పార్క్ వంటివి ఏపీకి వచ్చాయని గుర్తు చేసింది. ఏపీలో ద్రవ్యోల్బన రేటు కూడా 2023-24 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఆనాడు 7.57 శాతం ఉన్నది కాస్తా 2025-26 నాటికి ఏకాంగా 1.39 శాతానికి తగ్గడం మంచి పరిణామంగా ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

Tags:    

Similar News