టీడీపీ రాష్ట్ర కమిటీలో పేలని తూటాలా?
హతవిధీ.. ఏమిటిదీ అని టీడీపీ పరిస్థితి చూసి ఇప్పుడు అందరూ తలలు పట్టుకుంటున్నారట.. పోయినసారి అధికారంలో ఉన్న పార్టీ ఇదేనా అని ముక్కున వేలేసుకుంటున్నారట.. టీడీపీ పార్టీకి నియోజకవర్గ ఇన్ చార్జిలు, కోఆర్డినేటర్లు దొరకని పరిస్థితి ఉందా అని ఆశ్చర్యపోతున్నారట.. ఇప్పుడే ఇలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ ఎలా ఎదుర్కొంటుందని టీడీపీ కార్యకర్తలే స్థైర్యం కోల్పోతున్న పరిస్థితి ఉందట..
టీడీపీలో ఈ మధ్య రాష్ట్ర కమిటీ ప్రకటించారు. జంబో కమిటీ ఉన్నప్పటికీ సామాజికవర్గాల వారీగా పదవులు పంచి తీర్చిదిద్దారు. ఒకప్పుడు టీడీపీ రాష్ట్ర కమిటీ అంటే.. అబ్బో ఆ రేంజే వేరు.. ఇది ఏదో పెద్ద పోస్ట్ అని.. ఆ పార్టీలో ఒక ఫీలింగ్ ఉండేది.
చానెల్స్ లో డిబేట్ కు కూడా టీడీపీ ఆఫీస్ లోని అక్ నాలెడ్జ్ సెంటర్ సెంటర్ నుంచి సమాచారం తీసుకొని చర్చల్లో పాల్గొనే వారు. హోం వర్క్ చేసేవారు. కానీ మొన్న వేసిన రాష్ట్ర కమిటీ చూస్తే టీడీపీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.. ఎందుకంటే ఆ కమిటీలో పేలని తూటాలు ఎన్నో ఉన్నాయని.. ఆ కమిటీ వల్ల బూత్ స్థాయిలో టీడీపీ బలోపేతం కాదు అని విశ్లేషకులు అంటున్నారు. బూత్ స్థాయిలో ఎవరు పని చేస్తున్నారో తెలిసి కూడా ఏదో వైసీపీలోకి ఎక్కడ జంప్ అవుతారో అని భయపడి వేసిన కమిటీ అని కొందరు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు ఎంతోమందికి ఫోన్ చేసి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పిస్తాం అని చెబితే మాకు వద్దు అనే పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. వైసీపీలో ఉన్న లొసుగులు చూసి కూడా దానిని క్యాచ్ చేసే కమిటీ వేయలేదు అని.. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను డమ్మీలకు ఇచ్చే పరిస్థితి ఉందని కూడా అంటున్నారు.
ఉదాహరణకు చూస్తే.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎవరు ముందుకు రాకుంటే అక్కడ వేరే నియోజకవర్గానికి చెందిన సామాన్యుడిని తీసుకొని వచ్చి కోఆర్డినేటర్ పోస్ట్ ఇచ్చారు. అక్కడ చంద్రబాబు సామాజికవర్గం కూడా అంత లేదు. అయినా కూడా ఆయన సామాజికవర్గం వాళ్లనే నియమించడం విశేషం. అంటే టీడీపీ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంది అంటే రాబోయే రోజుల్లో ఇంకా అధ్వానంగా ఉంటుందని కూడా టీడీపీ వర్గాలే వాపోతున్నాయి..