ఇక యూట్యూబ్ లోనూ షాపింగ్.. అమెజాన్ - ఫ్లిప్ కార్ట్ కు చుక్కలే..!
ఇప్పుడు షాపింగ్ అంతా ఆన్ లైన్లోనే.. చేతుల్లో స్మార్ట్ ఫోన్లు పెరిగి పోయాకా..జనం షాపింగ్ మొత్తం ఫోన్ ద్వారానే చేస్తున్నారు. పైగా బయట మార్కెట్లో పోలిస్తే ఈ కామర్స్ సంస్థల్లోనే ధరలు తక్కువగా ఉండటంతో జనం వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ కామర్స్ సంస్థలు కూడా జనాన్ని ఆకట్టుకునేలా పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ కామర్స్ సంస్థల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు దేశంలో వేల కోట్లలో బిజినెస్ చేస్తున్నాయి. జనాల నాడిని పట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఆఫర్లు ప్రకటించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ప్రస్తుతం పోటీ పడే కంపెనీ మరొకటి లేదు. అయితే ఇన్నాళ్లు ఆ సంస్థల హవా సాగినా ఇప్పుడు గడ్డురోజులు ఎదుర్కొనే పరిస్థితి రాబోతోంది. అందుకు కారణం మరో దిగ్గజ సంస్థ ఈ కామర్స్ ప్రపంచంలోకి రావడమే. గూగుల్ యూట్యూబ్ ద్వారా ఈ కామర్స్ బిజినెస్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వీడియో హబ్ అయిన యూట్యూబ్ జనాలకు ఎంత చేరువైందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటూ గంటలు గంటలు గడిపే వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు గూగుల్ ఈ కామర్స్ సంస్థను రన్ చేసేందుకు అందుకు వేదికగా యూట్యూబ్ ను ఎంచుకుంది.
యూట్యూబ్ లో వీడియో లో ద్వారా తమ వద్ద ఎటువంటి వస్తువులు దొరుకుతాయో వీడియోల ద్వారానే వివరిస్తూ.. వాటి ధరలను కూడా తెలుపనున్నారు. ఇందుకోసం కస్టమర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ప్రత్యేక ఆఫర్లు ఉన్న వస్తువులను చూడడానికి సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అదే యూట్యూబ్ అయితే నేరుగా విభాగాల వారీగా తమ వద్ద దొరికే వస్తువుల గురించి వీడియోలు పెట్టే అవకాశం ఉండడంతో జనాలు వీడియోలను చూసేందుకు ఆసక్తి ప్రదర్శించే అవకాశం ఉంది. దాంతోపాటు గూగుల్ కంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉండడంతో జనాలను ఆకట్టుకోవడం సులభమైన అని అంతా అంటున్నారు. వీడియోలను చూపిస్తూ వాటిపై క్లిక్ చేస్తే.. ధరలు, ఆఫర్లు వీడియోల రూపంలోనే వివరించేలా యూట్యూబ్ లో ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నారు. ఈ కామర్స్ బిజినెస్ లో చిన్న చిన్న సంస్థలు ఎన్ని ఉన్నా తమను ఢీకొనే శక్తి ఎవరికీ లేకపోవడంతో అమెజాన్ ఫ్లిప్కార్ట్ దూసుకుపోయాయి. ఇక యూట్యూబ్ ఈ కామర్స్ లోకి వస్తే ఈ రెండు సంస్థలకు నష్టమేనని బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.