బెజవాడ ప్రేమోన్మది కేసులో మరో ట్విస్ట్ .. 48 గంటలు గడిస్తే కానీ ..!

Update: 2020-10-16 08:00 GMT
విజయవాడ క్రీస్తురాజుపురంలో ప్రేమోన్మాది చేసిన యువతీ దారుణ హత్య కేసు సంచలనంగా మారుతుంది. యువతి మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు.. ఆమె శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నట్టు గుర్తించారు. గొంతు సమీపంలో లోతైన గాయం కావడంతోనే బాధితురాలి మృతిచెందినట్టు వైద్యులు పోస్ట్‌ మార్టమ్ నివేదికలో వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే , యువతిని కత్తితో పొడిచిన తర్వాత , తనని కూడా గాయపరచుకున్న నిందుతుడు  గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.  48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమంటున్నారు. కత్తితో పొడుచుకోవడంతో నాగేంద్రబాబు పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. అయితే బాధితురాలికి, తనకు పెళ్లి జరిగిందని నాగేంద్రబాబు ఇప్పటికే పోలీసులకు స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. దాని ఆధారంగా మాచవరం పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, యువతి  అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన ఓ యువతి భీమవరంంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఈయర్ చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఇంటివద్దే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న బుడిగ నాగేంద్ర అలియాస్ చిన్నస్వామితో తేజస్వికి కొన్నాళ్లుగా పరిచయం ఉంది. అయితే గురువారం ఉదయం ఇంటి వెనకాల నుంచి యువతి  ఇంట్లో దూరాడు. లోపల నుంచి తలుపు గడియపెట్టి కత్తితో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తనను తాను పొడుచుకున్నాడు. ఆ సమయంలో రేషన్ కార్డు నమోదు కోసం బయటకు వెళ్లిన బాధితురాలి తల్లి కొద్దిసేపయ్యాక ఇంటికి తిరిగివచ్చారు. అయితే లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపు తెరిచారు. తలుపు తెరవగానే తేజస్విని తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కనిపించింది. దీంతో ఆమెను విజయవాడ ఈఎస్‌ఐకి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరోవైపు తీవ్ర గాయాలతో ఉన్న నాగేంద్రను పోలీసులు గుంటూరు జీజీహెచ్ ‌కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

ఇకపోతే , ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. యువతి, నాగేంద్రబాబు పెళ్లి చేసుకున్నారని ఇటు నాగేంద్రబాబు సోదరుడు చెబుతుండగా, మా అమ్మాయి ఎవరినీ ప్రేమించలేదని, పెళ్లి చేసుకోలేదని దివ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందనే పుకార్లు పుట్టించ వద్దంటూ వేడుకుంటోంది దివ్య తల్లి. యువతిని దారుణంగా చంపిన నాగేంద్రబాబుపై దిశ చట్టం ప్రయోగించి కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.  మరోవైపు, హాస్పిటల్ ‌లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న నాగేంద్రబాబే స్వయంగా తన పెళ్లి గురించి చెప్పాడని అతని సోదరుడు చెబుతున్నాడు.  వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటో సైతం బయటకు వచ్చింది. ఆ ఫోటోలో యువతి మెడలో తాళిబొట్టు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లిద్దరూ అంత సన్నిహితంగా ఉండి సెల్ఫీ దిగడం.. ఆమె మెడలో తాళి ఉండటం చూస్తుంటే.. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.ఇక, ఈ కేసుకు సంబంధించి నిందితుడు నాగేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
Tags:    

Similar News