చైనా బుద్ధి పోనిచ్చుకుంది కాదు... కేంద్రం సీరియస్

చైనా అంటేనే తీరే వేరు అని అంటారు. విశ్వసనీయత విషయంలో ఎవరైనా సందేహించాల్సినదే అని అంటారు.;

Update: 2026-04-13 04:12 GMT

చైనా అంటేనే తీరే వేరు అని అంటారు. విశ్వసనీయత విషయంలో ఎవరైనా సందేహించాల్సినదే అని అంటారు. మరీ ముఖ్యంగా చైనా విశ్వాస ఘాతుకం ఎంటతితో ఇప్పటికి ఆరున్నర దశాబ్దాల క్రితం జరిగిన భారత్ చైనా యుద్ధమే ఒక ఉదాహరణ. ఆనాడు భారత్ చీనీ భాయీ భాయీ అని తొలి ప్రధాని పండిట్ నెహ్రూ ఎంతో నమ్మారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ కే వస్తే మాకు కాదు ఇవ్వాల్సింది మిత్రుడికి అని చైనాను ప్రతిపాదించి భారత్ స్నేహభావాన్ని చాటుకున్నారు. ఇంతలా చేస్తే చైనా నుంచి కత్తులు దూయడమే బహుమానంగా వచ్చింది. టిబెట్ ని ఆక్రమించుకుని 1962లో ఏకంగా భారత్ మీద యుద్ధాన్ని చేసింది చైనా. ఈ పరిణామాల తరువాతనే ఎంతో శక్తివంతుడైన నెహ్రూ కృంగిపోయారు. చైనా చేసిన విశ్వాసఘాతుకం తలచుకుని ఆయన మానసికంగా నలిగిపోయి సరిగ్గా రెండేళ్ళు తిరగకుండానే 1964లో కన్ను మూశారు.

వీలు దొరికినపుడల్లా :

ఇక చైనా ఘాతుకాలు ఎప్పుడూ ఆగడం లేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1975 దశకంలోనూ ఆ తరువాత కాలంలోనూ లేటెస్ట్ గా కరోనా ప్రపంచాన్ని వ్యాపించిన వేళ లడఖ్ సరిహద్దులలో చైనా దురాక్రమణ యత్నాలు ఇవన్నీ కూడా భారత్ కి ఆ దేశంతో ఉన్న సవాళ్ళూ సమస్యలనే గుర్తు చేస్తూ వచ్చాయి. ఇక తాజాగా చూస్తే చైనా తన తెంపరి బుద్ధిని పోనిచ్చుకున్నది కాదు. భారత్ భూభాగంలోని పలు ప్రదేశాల పేర్లను మార్చేసింది. దాంతో భారత్ ఆగ్రహించింది.

అన్నీ కలిపేసుకుంటూ :

ఈ విధంగా భారత్ లోని అనేక ప్రాంతాలను చైనా తనలో కలిపేసుకుంటూ పేర్లను పెట్టడం మీద కేంద్రం అయితే గట్టిగానే ఖండించింది. ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది. ఇండియా విషయంలో ప్రతీసారి చైనా ఈ తరహా చర్యలకు పాల్పడుతూ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటుందని భారత్ మండిపడుతోంది. ఇలా పేర్లు మార్చినంత మాత్రాన అసలు నిజాలు అయితే ఎవరూ కప్పిపుచ్చలేరని కూడా భారత్ స్పష్టం చేఇంది.

ఏమిటీ దాష్టికం :

ఇక తాజాగా చూస్తే చైనా లఢాఖ్‌లోని రెండు ప్రదేశాలను హీన్, హెకాంగ్‌ అంటూ చైనా తన భూభాగంగా పేర్కొవడం మీద భారత్ తీవ్రంగానే స్పందించింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. చైనా తీరును పూర్తి స్థాయిలో తప్పుబట్టింది.కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేస్తూ భారత సరిహద్దులోని ప్రదేశాల విషయంలో పేర్లు మార్చడం మంచి పరిణామం కాదని అన్నారు. ఇవన్నీ తప్పుడు ఉద్దేశ్యాలతో చేస్తున్న పనులే అని ఫైర్ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌ సహా కీలకమైన సరిహద్దు ప్రదేశాలు భారత్ లోని అంతర్భాగం అని ఆయన స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని :

ఈ విధంగా కనుక చైనా వ్యవహరించదలచుకుంటే కనుక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించారు. చైనా తక్షణం ఈ తరహా చర్యలను మానుకోవాలని ఆయన కోరారు అయితే భారత్ చైనాతో కలసి సుదీర్ఘమైన సరిహద్దుని పంచుకుంటోంది. దాంతో దశాబ్దాల కాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దానికి కారణం చైనా దుందుడుకు విధానాలే అని అంటున్నారు మరి చైనా మారుతుందా అంటే సందేహమే అన్నది అందరి మాట. కోరి గిల్లడం గిల్లి కజ్జాలు పెట్టుకోవడం డ్రాగన్ కి అలవాటు అయిపోయింది. దీనికి ఏమి చేయాలన్నదే ఆలోచించాల్సి ఉందని దౌత్య నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News