షర్మిలకు ఏమైంది...లోకేష్ ట్వీట్ వైరల్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె పొత్తి కడుపు సంబంధిత సమస్యలతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె పొత్తి కడుపు సంబంధిత సమస్యలతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అందుకే ఆమె బయటకు ఎక్కడా కనిపించడం లేదు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల తాజాగా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అంతే కాదు ఆపరేషన్ తరువాత తాను వేగంగా కోలుకుంటున్నట్లుగా కూడా ఆమె చెప్పారు.
ఏమి జరిగిందంటే :
వైఎస్ షర్మిల పొత్తి కడుపు కు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది అని ఆమె పోస్టులో వెల్లడించారు. ఇక తన ఆరోగ్యం గురించి అందరూ చేసిన ప్రార్థనలు తనకు నైతికంగా మద్దతు తెలియచేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాను అందరి ఆశీస్సులతో బాగానే ఉన్నాను అని కూడా చెప్పారు.
జాగ్రత్త అంటూ లోకేష్ :
ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు అన్న వార్త ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్టు చేయడంతో వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆమె వేగంగా కోలుకుంటున్నారు అని తెలిసి సంతోషంగా ఉందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. మరింత త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. తగిన జాగ్రత్తలు తీసుకోండి అని లోకేష్ పేర్కొన్నారు. షర్మిల చేసిన ట్వీట్‌కు ఆయన ఈ విధంగా పోస్ట్ చేశారు.
గత కొంతకాలంగా :
ఏపీలో కాంగ్రెస్ కార్యకలాపాలు గత కొంతకాలంగా పెద్దగా లేవు. షర్మిల కూడా ఏపీ పర్యటనలు చేయడం లేదు. దాంతో ఆమె ఎందుకో సైలెంట్ అయ్యారని అంతా అనుకున్నారు. రాజ్యసభ సీటు దక్కకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని కూడా ఊహించి వార్తా కధనాలను ప్రసారం చేశారు. అయితే అవన్నీ కాదు ఆమె ఆరోగ్య సమస్యలతోనే పర్యటనలు చేయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆమె తాజాగా ఆపరేషన్ కూడా చేయించుకున్నారని అంటున్నారు.
అభిమానుల ఆందోళన :
ఇక షర్మిలకు ఆపరేషన్ జరిగింది అన్న వార్తలతో అభిమానులు కలవరం చెందారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆమెకు ఏమి జరిగింది అని ఆతృతగా ఆరా తీశారు. అయితే తన ఆరోగ్యం విషయంలో వస్తున్న ప్రచారానికి చెక్ పెడుతూ షర్మిల స్వయంగా పోస్టు చేయడమే కాదు తాను ఆపరేషన్ తరువాత బాగానే ఉన్నాను అని పోస్టు చేయడంతో అంతా ఇపుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2024 జనవరిలో షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. రెండున్నరేళ్ళుగా ఆమె ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా పనిచేస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా ఇపుడిపుడే కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో షర్మిల సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వచ్చాక ఏపీలో కాంగ్రెస్ కార్యక్రమాలను మరింత జోరుగా ముందుకు తీసుకుని వెళ్తారని అంతా అంటున్నారు.