వీడిన ఒంగోలు లాయర్ హత్య మిస్టరీ.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

రెండు మూడు రోజుల క్రితం ఒంగోలుకు చెందిన న్యాయవాది ఒకరు హత్యకు గురి కావటం కలకలాన్ని రేపింది.;

Update: 2026-04-13 04:50 GMT

రెండు మూడు రోజుల క్రితం ఒంగోలుకు చెందిన న్యాయవాది ఒకరు హత్యకు గురి కావటం కలకలాన్ని రేపింది. ఒంగోలు నుంచి విజయవాడ వెళుతున్న అతను చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన శవమై పడి ఉండటం తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మర్డర్ మిస్టరీని ఒక్క రోజులోనే చేధించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం హత్యకు కారణం.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న భార్య తీరు ఒక ఎత్తు అయితే.. అందుకు ఆమె బంధువైన కానిస్టేబుల్ మర్డర్ ప్లాన్ చేయటం ఇంకో ఎత్తు.

37 ఏళ్ల న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ భార్య నాగజ్యోతికి వేమవరం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకట కోటయ్య మరదలు అవుతుంది. పెళ్లికి ముందే వీరి మధ్య పరిచయం ఉంది. తన భర్త రోజూ మద్యం తాగి తిడుతూ ఇబ్బంది పెడుతున్నాడని కానిస్టేబుల్ కు చెప్పింది. దీంతో అతడ్ని అంతం చేసేందుకు గుంటూరులో తనకు పరిచయం ఉన్న శ్రీనివాసరావును సహకరించాలని కోరాడు. ఇద్దరూ లాయర్ హరిప్రసాద్ ను నరసరావుపేటకు పిలిపించారు. అక్కడ మద్యం కొన్నారు. అనంతరం కోటప్పకొండ రోడ్డు వైపు వచ్చి ఎన్నెస్సీ కాలువ వద్ద కూర్చొని ముగ్గురు మద్యం తాగారు.

ఆ తర్వాత జనసంచారం లేని ప్రాంతంలో తెల్లవారుజామున రెండు గంటల వేళలో కాలక్రత్యాల కోసం తమ వాహనాల్ని ఆపారు. హరిప్రసాద్ తన స్కూటీ దిగి రోడ్డు అంచున నిలబడగా.. ఇద్దరు రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. తీవ్ర గాయాలైన న్యాయవాది కిందపడటం.. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతడిపై స్కూటీ పడేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. షాకింగ్ నిజం ఏమంటే.. ఎస్పీ ఆఫీసులో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే కోటయ్య తీరు పోలీసు వర్గాల్లో షాకింగ్ చర్చకు కారణమైంది. రోజు వ్యవధిలోనే నిందితుల్ని అదుపులోకి తీసుకోవటంతో ఉన్నతాధికారులు విచారణలో పాలు పంచుకున్న పోలీసు సిబ్బందిని అభినందించారు.

Tags:    

Similar News