యూపీలో దారుణం.. జర్నలిస్ట్ సజీవదహనం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిస్టుల బతుకులకు ఆ రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది. ప్రజలకు వాస్తవాలు తెలిపే మీడియా గొంతు నొక్కేస్తున్నారు.
యూపీలో తాజాగా ఓ జర్నలిస్టును సజీవదహనం చేయడం కలకలం రేపింది. బలరాంపూర్ లో నివాసముంటున్న ఇంటికి నిప్పంటుకొని జర్నలిస్ట్ రాకేశ్ సింగ్, అతడి స్నేహితుడు సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో రాకేశ్ సింగ్ భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
అయితే దుండగులు కావాలనే జర్నలిస్టును చంపి ఉంటారని.. అతడి ఫ్యామిలీని వదిలేసి ఉంటారని.. ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇక జర్నలిస్టు సజీవ దహనంపై యూపీ సర్కార్ స్పందించింది. వారి కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. కాగా జర్నలిస్టు హత్యకు గల అసలు కారణాలు వెల్లడికాలేదు.