గంటకు 5వేలు, ఫుల్ నైట్ 15వేలంటూ మహిళా టెకీ ఫొటోతో దారుణం

Update: 2020-10-12 10:15 GMT
గ్రేటర్ నోయిడాలో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫొటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఈమె హై ప్రొఫైల్ సెక్స్ వర్కర్ అంటూ కావాల్సిన వారు సంప్రదించాలని పోస్ట్ ను వైరల్ చేశారు. మహిళా టెకీ ఫొటో.. ఫోన్ నంబర్ తో సహా సోషల్ మీడియాలో షేర్ కావడం నోయిడాలో కలకలం రేపుతోంది.

ఈ పరిణామంతో గ్రేటర్ నోయిడా మహిళా టెక్కీల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫొటో వైరల్ కావడంతో సదురు మహిళా టెకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సైబర్ సెక్యూరిటీ విభాగానికి బదలాయించారు.

 40 ఏళ్ల వయసున్న బాధితురాలు కొంతకాలంగా గ్రేటర్ నోయిడాలోని ఓ టాప్ మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో సీనియర్ ర్యాంక్ లో పనిచేస్తున్నారు. ఆకర్షనీయమైన వేతనాన్ని పొందుతున్నారు. ఆమెకు పెళ్లైంది. భర్త, ఇద్దరు పిల్లలతో నోయిడాలో జీవిస్తోంది. కొద్దిరోజుల కిందటే ఆమె తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అదే ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు తమ దందా కోసం వినియోగించుకున్నారు. హైప్రొఫైల్ సెక్స్ వర్కర్ గా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫేస్ బుక్ గ్రూపులు, వాట్సాప్ ద్వారా సర్క్యూలేట్ చేశారు. ఆ మహిళా టెకీ వాట్సాప్ నంబర్ ను ఫొటోకు ట్యాగ్ చేశారు. గంటకు 5వేలు, ఫుల్ నైట్ రూ.15వేలు రేటు అంటూ నిర్ధారించారు. పేమంట్ కోసం కోటక్ మహేంద్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ ను ఫొటోతోపాటు ముద్రించారని పోలీసులు గుర్తించారు.

ఆమెకు అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో ఈమె ఫొటోను పోస్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఫొటో పెయిడ్ సెక్స్ వర్కర్ గ్రూపులో పోలీసులు గుర్తించారు.
Tags:    

Similar News