చీమల్ని చంపబోయిన ఆమె.. చచ్చిపోయింది

Update: 2020-11-23 07:30 GMT
విన్నంతనే విడ్డూరంగా అనిపిస్తుంది కానీ.. ఇది నిజం. చీమల్ని చంపబోయిన ఒక యువతి అనూహ్యంగా మరణించిన వైనం షాకింగ్ గా మారింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని చోటు చేసుకున్న ఈ విషాదం.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చీమల్ని చంపబోతే చనిపోవటమా? అన్న సందేహం కలుగుతోందా? జరిగినదంతా తెలుసుకుంటే అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు.

చెన్నైలోని అమింజికరై ప్రాంతంలో సత్యమూర్తికి భార్య.. కొడుకు.. కుమార్తె ఉన్నారు. కుమార్తె ఐటీ ఉద్యోగిని. శనివారం ఆమె తన బెడ్రూంలో చీమలు ఉన్నట్లు గుర్తించింది. చీపురుతో వాటిని చిమ్మ.. ఊడ్చేసింది. అక్కడే చీమల పుట్ట ఒకటి కనిపించింది. దీంతో.. ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. చీమల పుట్ట మీద కిరోసిన్ చల్లి నిప్పు పెట్టాలని సలహా ఇచ్చింది.

దీంతో.. కిరోసిన్ డబ్బా తీసుకున్న సంగీత.. కిరోసిన్ ను చీమల పుట్ట మీద చల్లింది. పేపర్ తో నిప్పు పెట్టాలని చెప్పింది. నిప్పు వెలిగించగా కొన్నిచీమలు ఆమె కాలి మీదకు వచ్చాయి. ఆ కంగారుతో ఆమె చేతిలోని కిరోసిడన్ డబ్బా కదటం.. ఆ వెంటనే మంటలు చుట్టేశాయి. దీంతో పెద్దగా కేకలు వేయటంతో.. తండ్రి.. స్థానికులు వచ్చి మంటల్ని ఆర్పేశారు.

ఈ ఉదంతంలో సంగీతకు తీవ్ర గాయాలు కాగా.. ఆమె తల్లికి కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన సంగీతకు వైద్య పరీక్షలు చేస్తుండగా.. తీవ్ర గాయాల కారణంగా కన్నుమూసింది. స్వల్ప గాయాలైన సంగీత తల్లికి వైద్యం చేస్తున్నారు. ఈ ఉదంతం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చీమల్ని చంపబోతే.. తానే మరణించిన సంగీత ఉదంతం అక్కడి స్థానికుల్ని కదిలించి వేస్తోంది.
Tags:    

Similar News