దారుణం : ఊరు మొత్తం ఏకమై నగ్నంగా రాత్రంతా స్కూల్ లో ...మొబైల్స్ లో వీడియో తీశారు

Update: 2020-10-10 07:45 GMT
దేశంలో రోజూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో అర్థమౌతుంది. దేశంలో ఎదో ఒక మూల మహిళలు అత్యాచారాలకి , ఘోరమైన అవమానాలకు గురౌతున్నారు. మహిళల కోసం తీసుకొచ్చిన ఏ చట్టం కూడా వారికి అన్యాయం జరగకుండా ఆపలేకపోతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో  యువకుడితో పారిపోయిందన్న కారణంతో యువతి జుట్టు కత్తిరించి, నగ్నంగా మార్చి... రాత్రంతా చలిలో స్కూల్లో పడుకోబెట్టారు.అంతేకాదు, ఆ సంఘటనను సెల్ ‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా లో అప్ ‌లోడ్ కూడా చేశారు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతికి కొన్నేళ్ల క్రితం ఓ యువకుడితో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి భర్తతో నరకం అనుభవిస్తోంది. ప్రతీరోజూ ఆమెపై అతను దాడి చేస్తుండేవాడు.  చివరికి గర్భంతో ఉందని కూడా చూడకుండా ఓ రాత్రి ఆమె పొత్తి కడుపుపై కాలితో తన్నాడు. దీంతో గర్భ స్రావం జరిగింది. ఆ తర్వాత మరోసారి కూడా అలాగే దాడి చేసి గర్భం పోగొట్టాడు. కొడుక్కి సర్దిచెప్పాల్సిన అత్త కూడా కోడలిపై దాడికి సహకరించేది. ఈ క్రమంలో పలుమార్లు ఇరువురి కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నా లాభం లేకపోయింది. ఎన్నిసార్లు చెప్పినా అదే తీరు. దీనితో  ఆమె అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కలిసి పారిపోయింది. అయితే అతనికి అప్పటికే వివాహమైంది. ఇద్దరూ కలిసి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అసోంలోని టిన్సుకియాకు పారిపోయారు.

కొద్దిరోజులకు యువకుడి కుటుంబం నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చింది. జరిగిందేదో జరిగింది. ఇక గ్రామానికి వచ్చేయండి. అంతా కలిసి ఉందామని చెప్పారు. నిజానికి ఆ మాటలను నమ్మేందుకు కాస్త సందేహించినప్పటికీ చివరకు నమ్మకంతో గ్రామంలో అడగుపెట్టారు.ఆ ఇద్దరూ గ్రామంలో అడుగుపెట్టిన రాత్రి... అప్పటికే ఊరంతా ఒక్క దగ్గర గుమిగూడింది. వాళ్లు కనిపించడమే ఆలస్యం... గ్రామానికి చెందిన మహిళలు ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చారు. రాత్రి వేళ చన్నీళ్లు తెచ్చి ఆమె ఒంటిపై పోసి, బలవంతంగా జుట్టు కత్తిరించడమే గాక దుస్తులన్నీ చించేసి నగ్నంగా మార్చారు. ఆమె తన చేతులను అడ్డుపెట్టుకోగా చేతులు పైకెత్తాలని డిమాండ్ చేశారు.అడ్డుకోబోయిన ఆమె ప్రియుడిపై దాడి చేశారు. ఈ  మొత్తం వ్యవహారాన్ని మొబైల్ లో రికార్డ్ చేసి , సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. ఆమెను ఊరి నుంచి వెలివేయాలని కూడా తీర్మానం చేశారు. ఆమె ప్రియుడు ఆమెతో అన్ని బంధాలను తెంచేసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమెను నగ్నంగానే గ్రామంలోని స్కూల్ వద్దకు తీసుకెళ్లి పడేశారు. రాత్రంతా ఆ చలిలో నగ్నంగా... అవమాన భారంతో ఆమె కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ తర్వాత ఆమె తన తాతకు ఈ విషయం చెప్పడంతో  ఆయన గ్రామ పెద్దలను నిలదీశాడు. దీంతో రూ.40వేలు ఇస్తామని ఈ విషయాన్ని పోలీసుల వరకూ తీసుకెళ్లవద్దని రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది.
Tags:    

Similar News