మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటకు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారంతా ఉలిక్కిపడిన మదనపల్లె జంటహత్యల అంశంలో మరిన్ని షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. విచారణ జరిగే కొద్దీ.. మరణించిన అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు చెప్పే అంశాలు వింతగా.. విచిత్రంగా.. జీర్ణించుకోలేనివిగా మారాయి. ఈ కేసు చిక్కుముడులు వీడేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. మరిన్ని చిక్కుముడులు పడిన పరిస్థితి. ఇప్పటివరకు మూఢంతో కన్నతల్లే తన ఇద్దరు కుమార్తెల్ని దారుణంగా చంపేసినట్లు భావించగా.. అదేమీ నిజం కాదని.. చెల్లెల్ని.. అక్కే చంపినట్లుగా తల్లి చెబుతోంది.
తల్లిదండ్రుల మానసిక పరిస్థితి విచారణకు ఏ మాత్రం సరిగా లేకపోవటంతో.. గట్టి బందోబస్తు మధ్య వారిని కోర్టు ముందుకు హాజరుపర్చలేదు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారటమే కాదు.. కొత్త ప్రశ్నల్ని తెర మీదకు తీసుకొచ్చింది. మరణించిన పెద్ద కుమార్తె వైఖరి భిన్నంగా ఉండటం.. గతంలో ఆమె ప్రవర్తించిన తీరు కొత్త సందేహాలకు తావిస్తోంది. తొలుత తల్లే ఇద్దరు కుమార్తెల్ని చంపినట్లుగా పోలీసులు భావించారు.
తాజాగా జరిపిన విచారణలో తల్లి పద్మజ మాట్లాడుతూ.. తన చిన్న కుమార్తెను అక్క అలేఖ్య హత్య చేసినట్లుగా చెప్పినట్లు తెలిసిందే. చెల్లిని తాను చంపేశానని.. తన నోట్లో కలశం పెట్టి తనను చంపాలని.. తాను చెప్పిన మంత్రాల్ని జపిస్తూ ఉండాలని.. తాను వెళ్లి చెల్లెలు ఆత్మను తీసుకొస్తానని.. కలియుగం అంతమై.. సత్యయుగం ప్రారంభం కాగానే చెల్లెల్ని తీసుకొని వస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
కొద్దిసేపు ఆగితే తన ఇద్దరు కూతుళ్లు తిరిగి వచ్చేవారని.. అంతలోనే బయటవారు లోపలకు రావటంతో అది సాధ్యం కాలేదని ఆమె చెప్పినట్లుగా చెబుతున్నారు. పోలీసులు ఎంత విచారించినా.. తాము చెప్పిన విషయాల్నే నిందితులు పదే పదే చెబుతున్నారట. దీనికి తోడు అలేఖ్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు.
అంతా అయిపోయింది.. శివుడు వస్తున్నాడన్న వ్యాఖ్యతో పాటు.. సాయిదివ్యకు (చెల్లెలు) దెయ్యం పట్టిందంటూ మానసిక క్షోభకు గురి చేయటంతో పాటు.. అలేఖ్య శూలంతో సాయి దివ్యను చంపినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత తనను కూడా చంపేయాలని తల్లిదండ్రుల్ని కోరినట్లుగా విచారణలో వెల్లడైంది. హత్యలు జరిగిన ఇంట్లో ముగ్గులు.. విచిత్రమైన ఫోటోలు.. ఆకృతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం.. ఇరువురి అంత్యక్రియల్ని నిర్వహించారు. నిందితుల మానసిక పరిస్థితిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల సూచనతోనే వారిని కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు చెబుతున్నారు.