‘‘బాలయ్యను ఎవరూ తిట్టరు.. ఎందుకంటే బాలయ్యే..’’ ఎంత మాట!
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులకు కోపం వచ్చింది.;
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులకు కోపం వచ్చింది. తమ అభిమాన నటుడుపై జోకులు వేసిన స్టాండప్ కమెడియన్ సోహైల్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక షోలో ఎమ్మెల్యే బాలయ్యను అసెంబ్లీని అవమానించేలా సోహైల్ అహ్మద్ వ్యాఖ్యలు ఉన్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఏదిపడితే అది మాట్లాడితే క్షమించేది లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా స్టాండప్ కమెడియన్ సోహైల్ అహ్మద్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు ఒంగోలు పోలీసులకు సోహైల్ పై ఫిర్యాదు చేశారు. సోహైల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు ఆయనకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆ ఫిర్యాదులో కోరారు. బాలయ్య అభిమానులు ఒకరిపై ఇలా ఫిర్యాదు చేయడం అరుదుగా చెబుతున్నారు. సినీ నటుడిగా బాలయ్యపై చాలా మంది జోకులు వేస్తుంటారు. కానీ, సోహైల్ హద్దులు మీరి బాలయ్యను కించపరిచినట్లు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య అంటే ఒక బ్రాండ్, ఆయనను గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు ఆరాధిస్తుంటారు. కానీ, సోహైల్ మాత్రం తన కామెడీ షోలో బాలయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. జనాలను నవ్వించడం కోసం బాలయ్యను కించపరచాలా అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ఒక షోలో ‘‘బాలయ్య ఒరిజినల్ రెబల్ స్టార్. మాగ్జిమం మీరు రెబల్ అయితే ఏం చేస్తారు. తాగి ఆఫీసుకు పోతారు. కానీ బాలయ్య అసెంబ్లీకి పోయినాడు’’ అంటూ సోహెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా టీఎఫ్ఐలో ఫ్యాన్స్ వార్ నడుస్తుంటుంది. ఇలాంటి ఫ్యాన్ వార్ లో బాలయ్య అభిమానులు ఎక్కడా కనిపించరు. ఎందుకంటే మీరు డిఫెండ్ చేసుకోవాలని మీ హీరో తిడితే, వేరే హీరోలను తిట్టే పనిలేదు. ఎందుకంటే బాలయ్యే తిడతాడు. ఎవడ్రూ లం..కొడకా అని, ఆయన క్రమశిక్షణ ఇలా నేర్పిస్తున్నాడన్న మాట’’ అంటూ సోహైల్ కామెంట్స్ చేశాడు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్యను అసెంబ్లీని అవమానించేలా సోహైల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కామెంట్స్ బాలయ్య దృష్టికి వెళ్లాయా ? లేదా? అనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. బాలయ్య రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.