ఎస్ కోట మీద శోభా ఫ్యామిలీ కన్ను... ?
విజయనగరం జిల్లాలోని ఎస్ కోట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ పెట్టిన తరువాత ఇప్పటికి తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఏడు సార్లు టీడీపీయే గెలిచింది. ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే లేటెస్ట్ గా వైసీపీ గెలిచింది. అంత బలంగా టీడీపీకి ఉన్న ఈ సీటులో ఇపుడు వైసీపీ పట్టు సాధించింది.
బలమైన నాయకులు అంతా ఫ్యాన్ నీడన ఉన్నారు. 2009 నుంచి పోటీ చేస్తూ ప్రతీ ఎన్నికలో కనీసంగా ముప్పయి వేల దాకా ఓట్లు తెచ్చుకునే ఇందుకూరి రఘురాజు వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మరో వైపు చూస్తే సామాజికవర్గ సమీకరణలు, బొత్స సత్యనారాయణ రాజకీయ వ్యూహాలతో కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారు.
నిజానికి ఆయన గజపతినగరానికి చెందిన వారు. అయితే అక్కడ తన తమ్ముడు అప్పలనరసయ్యకు సీటు కోసం శ్రీనివాసరావుని బొత్స ఎస్ కోటకు షిఫ్ట్ చేశారు. ఇక జగన్ వేవ్ కూడా తోడు కావడంతో టీడీపీ కంచుకోటలో శ్రీనివాసరావు విజయం సునాయాసం అయింది.
ఇదిలా ఉంటే ఎస్ కోటలో 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన శోభా హైమావతి ఇపుడు వైసీపీలోకి వచ్చేశారు. ఆమె తెలుగు మహిళా ప్రెసిడెంట్ గా కూడా గతంలో పనిచేశారు. ఆమెకు ఎస్ కోటలో గట్టి పట్టుంది. అయితే టీడీపీలో సామాజిక సమీకరణల కరణంగా ఆమెకు టికెట్ మళ్ళీ దక్కలేదు.
దాంతో ఆమె కొన్నళ్ళ పాటు సైలెంట్ గా ఉండి తాజాగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమె కంటే ముందే కుమార్తే, టీడీపీలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేసిన స్వాతీ రాణి వైసీపీలో చేరి జీసీసీ చైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎస్ కోట నుంచి తళ్లీ కూతుళ్ళలో ఎవరో ఒకరు పోటీ చేయడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఇందుకూరి రఘురాజు కూడా చాన్స్ ఇస్తే ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారు. మరి కొత్తగా వైసీపీలోకి వచ్చిన తల్లీ కూతుళ్ళు కనుక టికెట్ కి గురి పెడితే టీడీపీలో వర్గ పోరు ముమ్మరం అవుతుంది అంటున్నారు. మరో వైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే తానే మళ్లీ మళ్లీ ఎమ్మెల్యె కావాలని అనుకుంటున్నారు.
అయితే ఆయన్ని నాన్ లోకల్ అని ముద్ర వేసి ఈసారి టికెట్ లేకుండా చేయాలని సొంత పార్టీలోనే రాజకీయం జోరుగా సాగుతోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎస్ కోటలో వైసీపీ బలంగా ఉంది అనుకుంటే జంపింగ్ లీడర్స్ రాకతో వర్గ పోరు పెచ్చరిల్లుతుందా అన్న డౌట్లు వస్తున్నాయట. ఏరి కోరి టీడీపీ నేతలను వైసీపీలోకి తెచ్చిన పెద్ద నాయకులే దీనికి బాధ్యత వహించాలని పార్టీలో వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఈ పోరు ఇలాగే సాగితే టీడీపీకి కంచుకోట దక్కడం ఖాయమే.