కొత్త లుక్ తో గరుడ శివాజీ...నెట్లో హాట్ టాపిక్

Update: 2019-06-19 08:21 GMT
‘ఆపరేషన్ గరుడ’ పేరిట హడావుడి చేసిన గరుడ శివాజీ ప్రత్యేక హోదా ఉద్యమ కారుడుగా పొలిటికల్ కెరీర్ మొాదలుపెట్టి చంద్రబాబుకు డుడు బసవన్నగా మారిన విషయం తెలిసిందే. టీవీ9 వాటా అమ్మకపు అక్రమాల వ్యవహారాల్లో టీవీ9 కొత్త యాజమాన్యం అలందమీడియా రవి ప్రకాష్ తో పాటు శివాజీపైన కూడా కేసు పెట్టింది. దీంతో రవి ప్రకాష్ తో పాటు గరుడ శివాజీ కూడా అజ్జాతంలోకి వెళ్లిపోయారు. తెలుగుదేశం గెలిస్తే బయటకు వస్తారని చాలా కామెంట్లు వచ్చాయి. అయితే, వీరిద్దరికి సత్సంబంధాలు ఉండే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దీంతో ఇక ఎంతోకాలం దాగలేం అని అర్థమయిన రవి ప్రకాష్ పోలీసుల ముందు హాజరయ్యాడు. అయితే, అప్పటికే అజ్జాతం నుంచి దాఖలు చేసిన ఆయన అన్ని బెయిలు పిటిషన్లను కోర్టులు తోసిపుచ్చాయి.

కొంతకాలం క్రితం రవి ప్రకాష్ స్వయంగా పోలీసుల వద్ద లొంగిపోయారు. పలుమార్లు విచారణకు హాజరయ్యారు. కానీ గరుడ శివాజీ ఆచూకీ మాత్రం కనిపించలేదు. మధ్యలో ఒకసారి నేనెక్కడికి వెళ్లాను- వడ దెబ్బ తగిలి ఇంట్లో ఉన్నాను అంటూ తేలేసిన తన కళ్లను కూడా చూపించినా ఇప్పటికీ బయటకు రాలేదు. ఇంతలో తాజాగా కొత్త అవతారంలో అతను ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాడు. చార్లీచాప్లిన్ ఆహార్యంతో మీసాలు చిన్నగా ట్రిమ్ చేసుకుని కనిపించే వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అయితే దానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. మరి ఇలా అజ్జాతంలో ఉండిపోవడమేనా? బయటకు వచ్చేదేమైనా ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి తన మిత్రుడు రవి ప్రకాష్ పై కోర్టులో బెయిలు గురించి వాదనలు ముగిశాయి. దాని ఫలితాన్ని బయట్టి అయినా శివాజీ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి. అయినా వడదెబ్బ తగ్గడానికి ఇన్ని రోజులు పడుతుందా? ఇది వైద్య వింత అంటూ సెటైర్లు పడుతున్నాయి శివాజీ మీద. సరే ఇవన్నీ పక్కన పెడితే అతని కొత్త అవతారం మాత్రం ఫన్నీగా ఉంది.
Tags:    

Similar News