షేక్ బాబ్జీ ఘన విజయం

Update: 2021-03-17 13:38 GMT
ఉపాధ్యయ ఎంఎల్సీ అభ్యర్ధిగా షేక్ బాబ్జీ ఘన విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానిక పీడీఎఫ్ బలపరచిన యూటీఎఫ్ అభ్యర్ధిగా షేక్ బాబ్జి పోటీ చేశారు. మొత్తం 11 మంది పోటీ చేయగా బాబ్జీకి 7983 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్ధి - పీఆర్టీయు మద్దతుతో పోటీ చేసిన గంధం నారాయణరావుకు 6446 ఓట్లొచ్చాయి.

తర్వాత స్ధానంలో చెఱుకూరి సుభాష్ చంద్రబోస్ కు 706 ఓట్లు, ఇళ్ళ సత్యనారాయణకు 300 ఓట్లొచ్చాయి. వీళ్ళకు మొదటి ప్రాధాన్యతగానే పై ఓట్లు రావటం గమనార్హం. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 17,467 ఓట్లుండగా 16054 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండు ఓట్ల లెక్కింపులోనే బాబ్జీ గెలుపు ఖాయమైపోయింది. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం వస్తేనే అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఈ లెక్కన 17467 ఓట్లలో బాబ్జీకి 9 వేలకు పైగా ఓట్లు రావటం చాలా అరుదనే చెప్పాలి. అయితే బాబ్జీ విజయాన్ని ఇంకా అధికారులు ప్రకటించాల్సుంది.


Tags:    

Similar News