ఏపీ పొలిటికల్ హాట్ టాపిక్: నియోజకవర్గాలు పెరిగినా.. కష్టమేనా ..!
ఏపీలో విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు 50 వరకు పెరగనున్నాయి. తద్వారా ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 అవుతాయి.;
ఏపీలో విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు 50 వరకు పెరగనున్నాయి. తద్వారా ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 అవుతాయి. దీంతో తమకు అవకాశాలు దక్కుతాయని.. త్యాగా లు చేయాల్సిన అవసరం లేదని నాయకులు భావిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే.. ఇక్కడే మరో సమస్య కూడా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నియోజకవర్గాలు పెరిగినంత మాత్రాన నాయకులకు పెద్దగా అవకాశం దక్కక పోవచ్చని చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణం.. కేంద్రం తీసుకువచ్చిన చట్టమేనని అంటున్నారు. 2029 నుంచి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోనుంది. ఇప్పటి వరకు మహిళా ప్రాతినిథ్యం అనేది.. పార్టీలు అనుసరిస్తున్న విధానాలను బట్టి మాత్రమే ఆధారపడి ఉండగా.. 2029నుంచి అది హక్కుగా మారనుంది. అంతేకాదు.. ఖచ్చితంగా మహిళలకు అవకాశం కల్పించకతప్పని పరిస్థితులు కూడా ఏర్పడనున్నాయని చెబుతున్నారు. కేంద్రం గత ఏడాది తీసుకువచ్చిన చట్టమే దీనికి కారణమని అంటున్నారు.
2029 ఎన్నికల నుంచి మహిళలకు కోటాను అమలు చేయనున్నారు. వారికి ఖచ్చితంగా 33 శాతం రిజర్వే షన్ అమలు చేయాలని చట్టం చెబుతోంది. దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడే.. 2029 అని డెడ్‌లై న్ పెట్టుకున్నారు. దీనిని బట్టి.. మహిళలకు అన్ని రాష్ట్రాలు, కేంద్రంలోనూ 33 శాతం రిజర్వేషన్ ఖచ్చి తంగా కల్పించాల్సి ఉంటుంది. తద్వారా.. ఏపీలో పెరగనున్న 250 స్థానాల్లో 85-90 అసెంబ్లీ స్థానాలను వారికే కేటాయించే పరిస్థితి వస్తుంది. దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు మాత్రమే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారు. మహిళలకు కొన్ని పంచాయతీ స్థానాలను ముందుగానే రిజర్వ్ చేసి.. వారికే ఇస్తున్నారు. ఇదే విధానం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు కూడా వర్తింపచేసేలా చట్టాన్ని తీసుకువచ్చారు. ఇదే జరిగితే.. మరింత మంది పురుష నాయకులకు అవకాశం తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చకు పరిమితమైనా.. 2029 నాటికి చట్టం అమల్లోకి వస్తే.. రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. దీంతో ఏమేరకు పురుష నేతలకు అవకాశం దక్కుతుందన్నది చూడాలి.