వైసీపీకి ఇదే మంచి ఛాన్స్‌.. వ‌దులుకోవ‌ద్దు.. !

వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్తారా అంటే.. క‌ష్ట‌మ‌న్న సమాధానమే వినిపిస్తోంది.;

Update: 2026-02-02 02:30 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్తారా అంటే.. క‌ష్ట‌మ‌న్న సమాధానమే వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలు.. పరిస్థితులను గమనిస్తే ఇప్పటికైనా వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లడం సరైన చర్య అని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లినా వెళ్లకపోయినా సభలో పెద్దగా చర్చించేందుకు ఏమీ లేదు. గత వైసిపి తప్పులనే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎత్తిచూపే అవకాశం ఉంటుంది కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోయినా పెద్ద‌గా సమస్య ఎదురు కాలేదు.

కానీ ఇప్పుడు 18 మాసాలు గడిచిన తర్వాత ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పరిణామాలను గమనిస్తే వైసిపికి ఇప్పుడు ఎక్కువ అవకాశం ఏర్పడింది. సభలో ప్రస్తావించే అంశాలు కావచ్చు.. ప్రజల తరపున ప్రశ్నించే అంశాలు కావచ్చు.. ఏది ఏమైనా వైసీపీ నాయకులకు ఇప్పుడు ఒక మంచి వేదిక ఏదైనా ఉంది అంటే అది అసెంబ్లీ అనే చెప్పాలి. గడిచిన 18 నెలలుగా వైసిపి నాయకులు సభకు వెళ్లకపోయినా గడిచిపోయింది. కానీ ఈ 18 మాసాల కాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు రైతులకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇతర వర్గాల అభిప్రాయాలను సమస్యలను ప్రస్తావించేందుకు ఇప్పుడు ఎక్కువ అవకాశం వైసీపీకే ఉంది.

ఒకవేళ సభకు వెళ్లినా సమయం ఇవ్వడం లేదు.. అని భావించినప్పటికీ ఖ‌చ్చితంగా ఏదో ఒక సమయంలో మాట్లాడేందుకు అవకాశం లభిస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజల మధ్య మంచి గుర్తింపు లభిస్తుంది అన్నది పరిశీల‌కులు చెబుతున్న ప్రధాన విషయం. అలా కాకుండా కేవలం పట్టుదలకు పోయి ఇప్పుడు కూడా సభకు వెళ్లకుండా వ్యవహరిస్తే అది మరింతగా ఇబ్బందికి గురి చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

సభా నాయకుడికి ఇచ్చిన సమయం త‌న‌కు ఇవ్వాలని జగన్ పట్టుబడుతున్నప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదన్నది క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక సభలను గమనిస్తే తెలుస్తుంది. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీకి ఎంత సమయం ఇస్తున్నారు? ప్రధానమంత్రి కి ఎంత సమయం ఇస్తున్నారు? అనేది గమనిస్తే ఈ తేడా అర్థమవుతుంది. కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న విషయాలను ప‌క్క‌న పెట్టి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.. ఇచ్చిన సమయంలోనే కీలకమైన అంశాలు లేవ‌నెత్తటం వంటి వ్యూహాత్మక అడుగులు వేయడం ద్వారా వైసిపి ఈ బడ్జెట్ సమావేశాలను సద్వినియోగం చేసుకునే దిశగా వెళ్లాలని పరిశీలనలు సూచిస్తున్నారు. మీరు ఏం చేస్తారనేది చూడాలి.

Tags:    

Similar News