ఏపీ స్థానిక ఎన్నికలు.. 28లోనే ..?
స్థానిక సంస్థలు ఎన్నికల విషయం మరోసారి అటకెక్కింది. ఇక వచ్చే రెండేళ్ల వరకు కూడా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.;
స్థానిక సంస్థలు ఎన్నికల విషయం మరోసారి అటకెక్కింది. ఇక వచ్చే రెండేళ్ల వరకు కూడా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వ్యవహారం అత్యంత చర్చనీయాంసంగా మారింది. గత ఏడాది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నీలం సాహ్ని ఈవీఎంలతో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని పేర్కొంటూ ఇటు ప్రభుత్వానికి అతి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు.
దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు బ్యాలెట్ విధానంలోనే జరుగుతున్నాయి. కానీ, ఈ దఫా మారుతున్న సాంకేతికత నేపథ్యంలో ఈవీఎంల ద్వారా నిర్వహించాలని భావించారు. కానీ, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆమోదం లభించలేదు. ఇక జనాభా లెక్కలు అదేవిధంగా కుల గణన వంటివి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలకు అవకాశం లేదని తెలుస్తోంది.
వచ్చే ఫిబ్రవరి నెల నుంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరి 20వ తారీకు కల్లా పూర్తి చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ పరిణామాల క్రమంలోని ఇటీవల తెలంగాణలోనూ ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేలాగా మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సో.. ఫిబ్రవరి 20 తర్వాత దేశంలో స్థానిక ఎన్నికలకు అవకాశం లేదు.
వచ్చే నెల 21-25 మధ్య దేశ వ్యాప్తంగా కులగణన ప్రారంభం అవుతుంది. ఇతర జిల్లాల సరిహద్దులు లేక మండలాలు సరిహద్దులను మార్చేందుకు కానీ అవకాశం ఉండదు. ఇలా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిలో జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది అంటే 2027లో జనాభా లెక్కలు జరగనున్నాయి. సో మొత్తంగా 2028 దాకా స్థానిక ఎన్నికల ప్రస్తావన గాని ఎన్నికలు గానీ ఉండే అవకాశం లేదు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన జరిగే అవకాశం ఉంటుందని ఒక అంచనా.