పవన్ కల్యాణ్ 'హనుమాన్' యాక్షన్ మొదలైంది!

అవును... పని చేయాలనే కృషి, పట్టుదల, అంతకంటే ముందు ఆలోచన, మనసు ఉండాలే తప్ప ప్రతీ శాఖలోనూ చేయడానికి ఎంతో ఉంటుందని అంటారు.;

Update: 2025-12-18 07:51 GMT

ఏపీ రాజకీయ చరిత్రలో అత్యంత డైనమిక్ డిప్యూటీ సీఎం అనే పేరు పవన్ కల్యాణ్ ఇప్పటికే దక్కించుకున్న సంగతి తెలిసిందే! ఉప ముఖ్యమంత్రిగా, తన శాఖలకు మంత్రిగా ఆయన సీరియస్ గా తనదైన శైలిలో పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా అటవీశాఖ మంత్రిగా తన బాధ్యతను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో "హనుమాన్" మొదలైంది.

అవును... పని చేయాలనే కృషి, పట్టుదల, అంతకంటే ముందు ఆలోచన, మనసు ఉండాలే తప్ప ప్రతీ శాఖలోనూ చేయడానికి ఎంతో ఉంటుందని అంటారు. కేబినెట్ లో పెద్ద మంత్రిత్వ శాఖ, చిన్న మంత్రిత్వ శాఖ అని ప్రత్యేకంగా ఏమీ ఉండవని.. మనసుపెట్టి ఆలోచిస్తే ప్రతీశాఖలోనూ చేయాల్సింది ఎంతో ఉంటుందని చెబుతుంటారు. తాజాగా ఏపీ అటవీశాఖ బాధ్యతలు తీసుకున్న పవన్ ని చూస్తే అది నిజమని అనక మానరు!

గతంలో అడవుల్లోని ఏనుగులు మానవ నివాస ప్రాంతాల్లోకి, పంటపొలాల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తే... నష్టపరిహారం ఇవ్వడమే ప్రభుత్వాల బాధ్యతగా నడిచిన పరిస్థితి! అయితే ఆ సమస్యకు శాస్వత పరిష్కారం తీసుకురావాలని.. అటు మనుషులకు - ఇటు ఏనుగులకు మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్న ఘర్షణలను నివారించాలని.. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వన్యప్రాణులను రక్షించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

ఆ ఆలోచనలోంచి పుట్టిందే... హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ (హనుమాన్) ప్రాజెక్ట్. దీంతో.. రాష్ట్ర ఆటవీ శాఖ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. గత నెలలో దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అధికారులు వివరించగా.. పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టు వివరాలను సమీక్షించారు. ఈ క్రమంలో బుధవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వ్యు జారీ చేసింది.

మానవసేవే మాధవ సేవ అని అంటారు.. అయితే.. ప్రకృతి పరిరక్షణ అనేది కూడా పరమాత్ముని సేవే అని చెప్పే ఉద్దేశ్యమో ఏమో కానీ.. ఈ అద్భుతమైన ప్రాజెక్టును పవన్ కల్యాణ్ తనకు ఎంతో ఇష్టమైన "హనుమాన్" పేరుతో కలిపారు! ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టును సమర్ధవంతంగా అమలు చేయడానికి, దాని లక్ష్యాలను సాధించడానికి పంచాయతీ రాజ్, వ్యవసాయం, ఉద్యానవన శాఖలతో అటవీ శాఖ సమన్వయం చేసుకోవాలని పవన్ సూచించారు.

కాగా... ఇప్పటికే మడ అడవుల సమ్రక్షణ కోసం గ్రీన్ వాల్స్ నిర్మించడం, ఎర్రచందనం రక్షణ కోసం కేంద్రం నుంచి రూ.39 కోట్లు పొందండం వరకూ పవన్ కల్యాణ్ ప్రకృతి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారనే విషయం చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే... మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణలు తగ్గాలని.. ఎవరి జీవితాలను వారు జీవించాలని.. ఒకరి జీవితాలను ఒకరు డిస్ట్రబ్ చేయకూడదనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హనుమాన్ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజానికం!

Tags:    

Similar News