మోడీ సర్కారు చేసిన అవమానాన్ని ఆమె మర్చిపోలేదట

Update: 2020-10-15 07:45 GMT
మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని తాజాగా స్పందించిన ఆమె.. తమకు జరిగిన అవమానాన్ని తాము ఎప్పటికి మర్చిపోలేమన్న ఆమె.. ఆర్టికల్ 370ను చట్టవిరుద్ధంగా రద్దు చేశారని.. దాన్ని తిరిగి సాధిస్తామని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంలో జమ్ముకశ్మీర్ కు చెందిన పలువురు నేతల్ని అప్పట్లో హౌస్ అరెస్టు చేశారు. తాజాగా మొహబూబా ముఫ్తీని విడుదల చేశారు. దాదాపు 14 నెలల పాటు హౌస్ అరెస్టులో ఉన్న ఆమె.. మంగళవారం రాత్రి విడుదలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని తమలో ఎవరూ మరిచిపోలేరని.. ఆర్టికల్ 370ను చట్ట విరుద్ధంగా కేంద్రంరద్దు చేసిందన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలన్న ఆమె.. అందుకు పోరాటం చేయాల్సి ఉందన్నారు. అయితే.. ఆ మార్గం అంత సులువు కాదన్న ఆమె.. పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికి తాను విడుదల అయ్యాను కానీ.. చాలామంది ఇంకా నిర్భందంలోనే ఉన్నట్లుగా చెప్పారు. గడిచిన పద్నాలుగు నెలలుగా ప్రభుత్వ గెస్టు హౌస్ లో ఆమెను నిర్భందంలో ఉంచటం గమనార్హం.
Tags:    

Similar News