సీరం వ్యాక్సిన్ వేస్ట్‌.. తేల్చేసిన ద‌క్షిణాఫ్రికా.. ప‌ది ల‌క్ష‌ల డోసులు వెన‌క్కి!

Update: 2021-02-17 01:30 GMT
భార‌త్‌కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింది. సీరం ఉత్ప‌త్తి చేసిన ఆస్ట్రాజ‌నికా వ్యాక్సిన్‌ను దేశీయంగా మ‌నం వినియోగించుకుంటూనే విదేశాల‌కు కూడా పంపుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాఫ్రికాకు కూడా ప‌ది ల‌క్ష‌ల ఆస్ట్రా జ‌నికా వ్యాక్సిన్ డోసుల‌ను ఎగుమతి చేశారు. ఈ నెల ప్రారంభంలోనే ఇవి ఆఫ్రికాకు చేరాయి.

దీంతో భార‌త్ దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంది కూడా. అయితే.. అనూహ్యంగా .. ద‌క్షిణాఫ్రికా ఈ వ్యాక్సిన్‌ను వెన‌క్కి పంపేస్తున్న‌ట్టు సంచ‌ల‌న‌ప్ర‌క‌టన చేసింది. త‌క్ష‌ణం.. ఈ డోసుల‌ను వెన‌క్కి తీసుకు వెళ్లాల‌ని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ద‌క్షిణాఫ్రికా కోరింది. ఈ మేర‌కు ఆదేశ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ.. ద‌క్షిణాఫ్రికాలో క‌రోనా నివార‌ణ‌కు దీనిని విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

అయితే..  ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన 501 Y.V2 క‌రోనా వేరియంట్‌ను అరిక‌ట్ట‌డంలో ఆస్ట్రాజ‌నికా.. ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింద‌ని మంత్రి వివ‌రించారు. ఆస్ట్రాజ‌నికాను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించి చూసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అయితే.. ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన క‌రోనాపై దీని ప్ర‌భావం అంతంత మాత్రంగానే ఉంద‌ని.. అందుకే దీనిని తిరిగి పంపేస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు.

అయితే.. ఇదే విష‌యాన్ని సీరం కూడా పేర్కొంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన క‌రోనా వేరియంట్‌పై ఆస్ట్రాజ‌నికా సంపూర్ణ‌స్థాయిలో ప్ర‌భావం చూపించ‌ద‌ని తాము కూడా గుర్తించామ‌ని.. కొద్దిగా మాత్ర‌మే ప్ర‌భావం చూపుతుంద‌ని తాము నిర్ధారించుకున్నాకే.. ఆ దేశానికి ఎగుమ‌తి చేశామ‌ని దీనిలో ఎలాంటి దురుద్దేశం లేద‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌డంగ‌మ‌నార్హం.

కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాఫ్రికాలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభం కాలేదు. అయితే.. త్వ‌ర‌లోనే క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రోగ్రామ్ ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న క్ర‌మంలో ఆస్ట్రాజ‌నికా..పై ఫ‌లితాలు సంతృప్తినివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.  ఈ నేప‌థ్యంలోనే.. ఇప్ప‌టి వ‌ర‌కు దిగుమ‌తి చేసుకున్న ప‌ది ల‌క్ష‌ల టీకాలు తిప్పిపంపుతుండ‌డం గ‌మ‌నార్హం. కొస‌మెరుపు ఏంటంటే.. మ‌రో ఐదు ల‌క్ష‌ల డోసులు ఈ వారంలో ద‌క్షిణాఫ్రికాకు పంపేందుకు.. సీరం రెడీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News