షర్మిల కంటే నేనే బెటర్...పగ్గాలు ఆమెకేనా ?

ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో కొత్త వారి కోసం వేట సాగుతోందా.;

Update: 2026-04-25 02:30 GMT

ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో కొత్త వారి కోసం వేట సాగుతోందా. ఏపీలో ఏమి జరుగుతోందో అన్ని విషయాలూ ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ పెద్దలకు తెలుసా. షర్మిల పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ గ్రాఫ్ పెంచారా లేక తగ్గించారా తొందరలో ఆమె పోస్ట్ లోకి ఎవరు వస్తున్నారు ఇవన్నీ అదే కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నేత ఏఐసీసీ మెంబర్ అయిన సుంకర పద్మశ్రీ ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ కి ఇసుమంత అయినా లాభం లేదని ఆమె కుండ బద్ధలు కొట్టారు. ఆమె కాంగ్రెస్ వల్ల లాభపడిందేమో కానీ కాంగ్రెస్ కి చేసిందేమీ లేదని పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ టార్గెట్ ఎందుకంటే :

షర్మిల జగన్ నే కేవలం టార్గెట్ చేస్తూ పార్టీని పడకేయించారు అని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కోసం ఎందరో పెద్దలు ఈ రోజుకీ కనిపెట్టుకుని ఆమె గుర్తు చేశారు. పార్టీ అంటే పడి చచ్చే కార్యకర్తలు కూడా ఉన్నారని ఏపీలో రాజకీయంగా ఎదగాల్సిన సమయం ఇదేనని ఆమె అన్నారు అయితే షర్మిల మాత్రం జగన్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు అని అన్నారు. జగన్ ని జనాలు ఓడించేశారు. ఆయన విషయం ఇపుడు అప్రస్తుతం అని ఆమె అన్నారు. ఏపీలో పోరాటం నిజంగా చేయాల్సింది ఎన్డీయే ప్రభుత్వం మీద అని ఆమె చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అదే చేస్తోంది అని ఆమె గుర్తు చేశారు. కానీ షర్మిల మాత్రం ఎంత సేపూ తన సొంత విషయాలను పార్టీ వేదికల మీదకు తెచ్చి ముడిపెడుతూ కాంగ్రెస్ ని ఏమీ కాకుండా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర పెద్దలకు తెలుసు :

ఏపీలో ఏమి జరుగుతోంది అన్నది కేంద్ర పెద్దలకు తెలుసు అని ఆమె అన్నారు. అయితే దేనికైనా సమయం ఉంటుందని అన్నారు. షర్మిలను పీసీసీ చీఫ్ గా చేసి ఏదైనా పార్టీ లేస్తుందేమో చూశారని ఆ పని జరగకపోగా ఉన్న వారు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది అని సుంకర పద్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధం కావాల్సిన చోట షర్మిల మొక్కుబడిగా ఏపీకి వస్తూ పోతున్నారు అని ఆమె విమర్శించారు.

తనతో సహా ఎందరో :

షర్మిల ప్లేస్ లో ఎవరైనా పీసీసీ చీఫ్ గా ఉంటే ఎంతో బాగా పనిచేస్తారు అని పద్మశ్రీ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్ళుగా తాను పార్టీ కోసం పనిచేస్తున్నాను అని ఆమె అన్నారు. అలా తనలా అనేక మంది పార్టీ కోసం ముందుకు వస్తారు అని చెప్పారు. అందువల్ల కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఏపీ విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తోంది అని ఆమె అన్నారు. ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే కనుక షర్మిల పోస్ట్ తొందరలోనే పోతుంది అన్నట్లుగానే ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ సంస్థాగతంగా అనేక మార్పులు చేస్తుందని అందులో ఏపీ కూడా ఉందని అంటున్నారు. మరి షర్మిలకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఉంటుందా ఉండదా అన్నది అయితే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News