ఇంటర్ రీవాల్యుయేషన్ పై సంచలన నిర్ణయం

Update: 2019-05-01 12:20 GMT
లక్షల మంది విద్యార్థులు రాసిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరగడం.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో తెలంగాణలో ఇది పెద్ద దుమారం అయిన సంగతి తెలిసిందే. దీనిపై వేసిన త్రిసభ్య కమిటీ సైతం కాంట్రాక్ట్ సంస్థ గ్లోబరీనా సంస్థ తప్పు ఉందని తేల్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఫెయిల్ అయిన విద్యార్థుల రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థుల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆరోపనలు వచ్చిన గ్లోబరీనా సంస్థకు మళ్లీ బాధ్యతలు అప్పగిస్తే ఫలితం ఉండదని తెలంగాణ సర్కారు నిర్ణయానికి వచ్చింది.

దీంతో   గ్లోబరీనాతోపాటు మరో స్వతంత్ర సంస్థతో కూడా రీవాల్యుయేషన్, ఫలితాలను సమాంతరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరీక్షల వరకు మాత్రం గ్లోబరీనాను పర్యవేక్షణకే పరిమితం చేసి కొత్త స్వతంత్ర సంస్థకే పూర్తి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యింది.

ఈ రెండు సంస్థలు ఏకకాలంలో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ నిర్వహించనున్నాయి. కొత్తగా స్వతంత్ర సంస్థను ఎంపిక చేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీస్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మొత్తం నూతన సంస్థకే అప్పగించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది నుంచి స్వతంత్ర సంస్థకే ఇంటర్ బాధ్యతలను అప్పగించేందుకు తెలంగాణ సర్కారు సూత్రప్రాయం నిర్ణయించింది.  
    

Tags:    

Similar News