• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు ఎందుకిలా...

చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు.. సీనియర్ల మనోవేదన!

By - Tupaki Desk
Update: 2021-10-21 16:30 GMT
టీడీపీ అంతర్గత కలహాలు మొదలయ్యాయా?.. దీనికి కారణం ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభినేనా? పట్టాభిని చంద్రబాబు ఎందుకు వెనుకేసుకుని వస్తున్నారు. దీనికి కారణం ఏమిటీ.. చంద్రబాబు ఎందుకు పట్టాభి ప్రభావంలో పడుతున్నారు... లేక చంద్రబాబే పట్టాభితో ఇలా మాట్లాడించారా? ఇలా అనేక అనుమానాలు తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్నాయి. పట్టాభి ఇంటిపై పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ప్రచారాస్త్రంగా చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ వ్యూహాలు అసలుకే మోసం చేస్తున్నాయని ఈ పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఒకటి తలిస్తే.. పార్టీ సీనియర్లు మరోల తలుస్తున్నారు. పట్టాభి వ్యవహారం పార్టీని తీరని నష్టాన్ని కల్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. పట్టాభి ప్రభావంలో చంద్రబాబు పడిపోతున్నారని చెబుతున్నారు. ఇకనైనా జాగ్రత్త పడకపోతే పార్టీకి నష్టమేనని హెచ్చరిస్తున్నారు.

పట్టాభి ఒక మాటతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై పరుష పదజాలంతో దూషించడం తగదని హితవుపలుకున్నారు. సీఎం జగన్‌ను ఉద్దేశించి పట్టాభి చేసిన వ్యాఖ్యలను టీడీపీలోని పలువురు సీనియర్లు తప్పుబడుతున్నారు. పట్టాభిని చంద్రబాబు వెనుకేసుకుని రావడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యలపై టీడీపీలో అంతర్గతంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో పనిచేయకుండా కేవలం మీడియాకే పరిమితమైన నేతల వ్యవహరశైలి ఇలాగే ఉంటుందనే చర్చ ఆ పార్టీ ప్రారంభమైంది. ప్రజల నాడి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీకే నష్టమనే అభిప్రాయాలు టీడీపీలో బలంగా వినిపిస్తున్నాయి. పైగా ఇలాంటి నేతలను చంద్రబాబు సమర్దించడం మంచిదికాదని పలువురు సూచిస్తున్నారు. వక్ర మార్గాలతో పార్టీ పరువును తీస్తున్నారని వాపోతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా వాస్తవాలను గ్రహించలేకపోతున్నారని చెబుతున్నారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టమేనని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పార్టీ పరువు పోతుందని చెబుతున్నారు. రెచ్చగొట్టే మార్గాల వల్ల ప్రజలకు చేరువ కాలేమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత రాదని చెబుతున్నారు. ఇలాంటి ఘటన వల్ల మీడియాలో ప్రచారమే తప్ప.. అంతిమంగా పార్టీకి ఇబ్బందేనని హెచ్చరిస్తున్నారు. పార్టీ నేతల వ్యాఖ్యలను వ్యవహారశైలిని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారని చెబుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత రానంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒక్కసారి ప్రజల్లో వ్యతిరేకవస్తే ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కష్టమేనని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.  


టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా చంద్రబాబు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిన పెద్దగా మద్దతు రాలేదని వారు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు బంద్ ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపాలని చూశారని, అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. మోజార్టీ నేతలు బంద్‌కు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ నేతలే బంద్‌కు దూరంగా ఉంటే ప్రజలు ఎలా భాగస్వాములవుతారు? అని ప్రశ్నిస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాల ద్వారా లబ్ధిపొందడానికి బంద్‌కు పిలుపిచ్చినా ప్రజలు అసలు పట్టించుకోకపోవడానికి ఇదే కారణమని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా ఆచితూచి వ్యవహరించాలని, చేతలు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
Tags:    
  • Nara Chandrababu naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS