• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబూ విన్నారా -...

చంద్రబాబూ విన్నారా - టీడీపీని పవన్ ఓడించాడట

By - Tupaki Desk
Update: 2019-06-15 14:30 GMT
పవన్ గెలవకపోయినా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. దీనికి సినిమా నేపథ్యం కావడం ఒక కారణమైతే, అతని ఆవేశపూరితమైన ఆట్యిట్యూడ్ ఇంకో కారణం. తాజాగా పశ్చిగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సీనియర్ నటుడు సుమన్ పవన్ కళ్యాణ్ మీద ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

టీడీపీ ఓటమికి కారణాలేమిటో నిన్నటి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే కదా. మరి దానికి సమాధానం అన్నట్టుగా నటుడు సుమన్ యాదృశ్చికంగా స్పందించారు. ఏపీలో తెలుగుదేశం ఓడిపోవడానికి పవన్‌ కల్యాణే కారణమని సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూడా నిన్న ఈ మాట అనలేదు. మరుసటి రోజు ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యకరమే.

నాకు బుద్ధొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు. జగన్ అసాధారణ విజయం సాధించారు. తదనంతరం కూడా తన ముద్ర వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సమన్యాయం చేయడం తనకు బాగా నచ్చిందని సుమన్ వ్యాఖ్యానించారు.

తెలుగుదేశంపై ఎన్నికల ముందు జనసేన  అధిపతి పవన్ కళ్యాణ్ పలు అవినీతి ఆరోపణలు చేశారు. అయితే, టీడీపీ కంటే ఎక్కువగా ఆయన జగన్ పై అనేక ఆరోపణలు చేశారు. ఏనాడూ అధికారంలో లేని జగన్ పై పవన్ చేసిన విమర్శలు జగన్ కి నష్టం చేయకపోగా పవన్ కి , టీడీపీకి నష్టం చేశాయని వాదన ఉన్న నేపథ్యంలో సుమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇక సినిమా పరిశ్రమ విషయంలోనూ అతను ఓ కామెంట్ చేశారు. సినిమా పరిశ్రమను కూడా ఏపీకి తీసుకొచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని జగన్‌ ను కోరారు.


    

Tags:    
  • Hero Suman 
  • Pawan Kalyan 
  • Janasena 
  • Telugu News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS