సెప్టెంబర్ 30 వరకు నగరంలో 144 సెక్షన్ అమలు...

Update: 2020-09-18 06:00 GMT
ముంబై మహానగరంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముంబై మహానగరంలో సెక్షన్ 144 ను విధిస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నారు.  సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఈ సెక్షన్ అమలులో ఉండబోతున్నది.  కరోనాను అరికట్టాలి అంటే సమూహాలను అడ్డుకోవాలని, అప్పుడే కరోనాకు అడ్డుకట్ట వేయగలుగుతామని ముంబై డిప్యూటీ కమిషనర్ .  

ఒక్క ముంబై నగరంలోనే రోజుకు 3 నుండి 4 వేలకి  కేసులు నమోదవుతున్నాయి.  ముంబైలో ఇప్పటి వరకు1.75 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  దీనితో నగరంలో మరిన్ని రోజులు  లాక్ డౌన్ అవసరం అని భావించిన నగర కమిషనర్  నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్స్ లో ఒకరికి మించి ఎక్కువమంది ఒకేచోట గుమ్మికూడదు అని తెలిపారు. అవసరమైన కార్యకలాపాలు మరియు అవసరమైన వస్తువులు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల సరఫరాకి అనుమతి ఇచ్చారు. అలాగే , సంస్థల ద్వారా పనిచేసే బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజ్, క్లియరింగ్ కార్పొరేషన్, స్టాక్ బ్రోకర్లు మరియు సెబీ రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ పనిచేయడానికి అనుమతి ఇవ్వగా, ఆహారం, కూరగాయలు, రేషన్, మిల్క్ బూత్ మరియు ఇతర దుకాణాలు తెరిచి ఉండటానికి అనుమతినిచ్చారు. హాస్పిటల్స్, ఫార్మా,   ల్యాబ్స్, మెడికల్ నర్సింగ్ కాలేజీలు, మెడిసిన్ తెరిచి ఉంటాయి. వీటితో పాటు, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు, విద్యుత్, పెట్రోలియం, చమురు, మీడియా సేవలు, ఇ-కామర్స్ డెలివరీ మరియు ఇతర అనవసర వస్తువులు పనిచేయడానికి అనుమతి ఉంది.
Tags:    

Similar News