నరసరావు పేటలో 144 సెక్షన్

Update: 2019-09-16 12:21 GMT
కోడెల మరణం నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కోడెల స్వస్థలం నరసరావు పేట. తొలుత వైద్య వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్న కోడెలను 1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అపుడు ఆయన వయసు 36 సంవత్సరాలు.

రాజకీయ ప్రవేశం చేశాక... 20 సంవత్సరాల పాటు ఆయనకు ఓటమి తెలియదు. ప్రతి ఎన్నికలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ 2004 - 2009 ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంలో ఆయన నిలవలేకపోయారు. వరుసగా గెలిచిన ఆయన వరుసగా ఓడిపోవడంతో ఆ నియోజకవర్గాన్ని వీడి సత్తెనపల్లికి వచ్చి 2014లో గెలిచారు. అయినా... ఆయనకు ప్రధాన కార్యక్షేత్రం నరసరావుపేటే. ఇప్పటికీ ఆయనకు అక్కడ బలమైన వర్గం ఉంది. దీంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నరసరావు పేట నియోజకవర్గంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈరోజు నుంచి ఈనెల 30 వరకు ఇది అమల్లో ఉంటుంది.
Tags:    

Similar News