నాందేడ్ లో బీఆర్ఎస్ రెండో సభ.. పెద్ద ప్లాన్ లో కేసీఆర్

Update: 2023-01-22 11:30 GMT
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి సభ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో సభ నిర్వహణకు ప్లాన్ వేస్తోంది. అయితే రెండో సభను తెలంగాణేతర ప్రదేశంలోనే పెట్టాలని చూస్తున్నారు. ఇందుకు మహారాష్ట్రలోని నాందేడ్ ను ఎంచుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఉత్తర సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో నాందేడ్ కు, తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ చాలా మంది తెలుగువారు వ్యాపారం చేస్తున్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్, నిజామబాద్ జిల్లాలకు చెందిన వారికి ఈ ప్రాంతంతో అనేక సంబంధాలున్నాయి. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాందేడ్ లో రెండో సభనిర్వహించాలని చూస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ నుంచే ప్రజలను తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ పార్టీ జోరును పెంచడానికి భారీ స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ పేరు దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఊపు తగ్గకముందే సభలు నిర్వహిస్తే ప్రత్యేకంగా నిలుస్తామని భావిస్తున్నారు. అయితే నాందేడ్ సభను ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. రెండో వారంలో కేసీఆర్ బర్త్ డేతో పాటు సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారు. అందుకే మూడో వారంలో నాందేడ్ సభను నిర్వహించే అవకాశం ఉంది.

ఈ సభకు ఉత్తర తెలంగాణ నుంచే ప్రజలను సమీకరించనున్నారు. మహరాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల నాయకులు ఈ బాధ్యత తీసుకోనున్నారు. వీరితో పాటు నాందేడ్ ప్రాంతంలో ఉన్న తెలుగువారిని ఆహ్వానించనున్నారు. ఈ రెండు జిల్లాలకు చెందిన వారు నాందేడ్ లో పలు వ్యాపారలు చేస్తూ కీలకంగా మారారు. అంతేకాకుండా తెలంగాణకు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. అందువల్ల అన్నింటికి అనుకూలంగా ఉంటుందని నాందేడ్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ ప్రతీ కార్యక్రమానికి ఓ స్కెచ్ ఉంటుంది. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని సభలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణలో కలిసి ఉండేవి. వాటిని బేస్ చేసుకొని సభలను నిర్వహిస్తారని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలోని రైతుబంధు లాంటి పథకాలు తమ ప్రాంతంలో కూడా ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర రైతులు కోరుతున్నారు. దీంతో నాందేడ్ లాంటి చోట పెట్టే బీఆర్ఎస్ సభను తప్పకుండా ఆదరిస్తారని అంటున్నారు.
Tags:    

Similar News