మైనార్టీ కాలేజీల‌కు షాక్‌: ‌నీట్‌ పై సుప్రీం విచార‌ణ‌

Update: 2020-04-30 07:53 GMT
నీట్‌ ను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన మైనార్టీ కళాశాల‌లకు షాక్ త‌గిలింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ (NEET)పై కొన్ని మైనారిటీ కాలేజీలు ఆ ప‌రీక్ష‌తో సంబంధం లేకుండా ఇష్టారీతిన మెడికల్ సీట్లు కేటాయిస్తుండటంతో సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్టింది. దానిపై విచారణ చేపట్టింది. బుధవారం విచార‌ణ చేయ‌గా దీనిపై స్పష్టత ఇచ్చింది. నీట్ మాత్రమే ఎంబీబీఎస్‌కు అర్హత సాధించేందకు ప్రవేశ పరీక్ష అని, దానికి మ‌రే ప‌రీక్ష లేదంటూ తేల్చి చెప్పింది. నీట్ ప‌రీక్ష‌పై ప్రైవేట్ కళాశాల‌లు కూడా త‌ప్ప‌నిస‌రిగా పాటించాలని ఆదేశించింది.

నీట్ ద్వారా విద్యార్హతలో కొన్ని ప్రమాణాలు తప్పనిసరిగా భాగం అవుతాయని పేర్కొంది. వాటిని పట్టించుకోకుండా వ్య‌వ‌స్థ చెడగొట్టేలా ప్రైవేటే క‌ళాశాల‌ల తీరు ఉంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ప్రవేశ పరీక్షను రద్దు చేయడంలో ఇన్‌స్టిట్యూట్ అడ్మినిస్టేటర్లకు ఎటువంటి హక్కులు లేవు అని స్ప‌ష్టం చేసింది. ఇతర నోటిఫికేషన్లు, రూల్స్ వంటివన్నీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ కిందే వర్తిస్తాయని - గ్రాడ్యుయేట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివేందుకు దేశవ్యాప్తంగా నీట్‌ను ప్రవేశ పరీక్షగా గుర్తించాల‌ని సూచించింది.

నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైతే అది రీజనబుల్‌గా ఉందని పేర్కంది. పలు మెడికల్ ఇనిస్టిట్యూట్ లు ఫీజులు తీసుకుని.. ఎంట్రన్స్ టెస్టులు తీసేస్తూ.. లేదా మార్కుల ఆధారంగా కాలేజీల్లో జాయిన్ చేసుకుంటూ విద్యార్థతను పాడు చేయడం చేస్తున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వాటి స్వలాభాల కోసం విద్యార్థుల భవిష్యత్ పాడుచేస్తున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నియమాలు పాటించడం తప్పనిసరి అని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ ఈ చట్టాలకు అతీతులు కారని పేర్కొంది. నేషనల్ ఇంట్రస్ట్ ను కాదనే హక్కు ఎవరికీ లేదని, సిస్టమ్‌లో జరుగుతున్న అక్రమాలు తొలగిస్తామ‌ని తెలిపింది. మెరిట్ ను తొక్కేసి స్వలాభాల కోసం పనులు చేస్తున్న గుర్తింపు ఉన్న/ లేని మైనారిటీ కాలేజీలు తప్పనిసరిగా ఈ నిబంధ‌న పాటించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పింది.

2012 నుంచి సుప్రీం కోర్టు లో ఈ కేసు పెండింగ్ లోనే ఉంది. ఈ పిటిషన్ వేసిన వారిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్నారు. నీట్‌ను ఛాలెంజ్ చేసిన కళాశాల‌లు ఇవే..

- Christian Medial College Vellore Association
- AP Pvt Medical and Dental College Association
- Annamalai University
- Manipal University
- Karnataka Pvt Medical
- Kerala Private Medical College Management Association
- Educate Charitable Trust
- Tamil Nadu Deemed University Association
- Darus Salam Education Trust

సుప్రీంకోర్టుకు వెళ్లి ఎదురుదెబ్బ తిన్న ఈ క‌ళాశాల‌ల‌న్నీ ప్ర‌స్తుతం విధిగా కేంద్ర నిబంధ‌న‌లు పాటించాల్సిందే.


Tags:    

Similar News