2018లోనూ టీడీపీ 2014 ఫార్ములా!
ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఇది చంద్రబాబు ఏకైక లక్ష్యం. ఎన్నిక ఏదైనా సరే. అధికారంలోకి ఎలా రావాలి అన్నదానిపైనే ఫోకస్. దానికి కొన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటాడు. దాని మీద వచ్చే విమర్శలను పట్టించుకోరు. అది తప్పా ఒప్పా అని చూడరు. అబద్ధమైనా - నిజమైనా ఒకదాన్ని నమ్మాలి - దాన్ని జనం చేత నమ్మించాలి. 2014లో చంద్రబాబు చేసింది ఇదే. మళ్లీ 2018 తెలంగాణ ఎన్నికల్లో అదే ఫార్ములా మొదలుపెట్టాడు. అయితే అది రివర్సవుతోంది.
2014లో చంద్రబాబు కనిపెట్టిన ఫార్ములా.. తల్లికాంగ్రెస్ - పిల్ల కాంగ్రెస్. చివరకు ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబు చెప్పింది నిజం కాదని తేలిపోయింది. అసలు కాంగ్రెస్ కు - వైసీపీకి ఏ సంబంధాలు లేవని జనానికి అర్థమైంది. అయితే, అప్పటికే చంద్రబాబు పబ్బం గడుపుకున్నారు. కట్ చేస్తే... తల్లి కాంగ్రెస్ తో తెలుగు దేశాన్ని కలిపేశారు. ఆయన అనుకుంటే చాలు ఎన్టీఆర్ ఆత్మ అడ్డొచ్చినా ఒప్పుకోరు.
ఇపుడు 2018లో పెద్ద మోదీ - చిన్నమోదీ అని కొత్త నినాదం అందుకున్నారు. పాపం కొంచెం ఆలస్యంగా ట్రెండ్ చేస్తున్నారు చంద్రబాబు దీనిని. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూకట్ పల్లిలో చేసిన ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఎవరు ఎవరితో పొత్తులకు పోతారో జనానికి ఈ సారి క్లారిటీ ఉంది. అందుకే పెద్దమోదీ - చిన్న మోదీ నినాదం జనాల్లోకి చంద్రబాబు ఎంత ట్రై చేసినా వెళ్లదంటున్నారు నెటిజన్లు. పైగా ఇంటర్నెట్ లో చరిత్ర మాకూ తెలుసు బాబూ... అంటూ చంద్ర బాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.