సండ్రను అలా సిద్ధం చేశారా?

Update: 2015-07-09 09:42 GMT
ఓటుకు నోటు కేసులో తాజాగా జైలుకు వెళ్లిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు చెందిన ఒక ఆసక్తికరమైన అంశం ఒకటి వినిపిస్తోంది. ఆ మధ్యన ఆయనకు ఏసీబీ నోటీసులు ఇచ్చే సమయానికి అందుబాటులో లేకుండా పోయి.. ఆ తర్వాత తనకు ఆనారోగ్యంగా ఉందంటూ పదిరోజుల పాటుచికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన రాజమండ్రిలోని ఒక ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిసిందే. అయితే.. రాజమండ్రి ఆసుపత్రిలో సండ్రను ప్రత్యేకంగా సిద్ధం చేశారని చెబుతున్నారు. ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో సండ్రకు సంబంధించిన కీలక ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నట్లు తెలిసిన తమ్ముళ్ల బృందం ముందస్తు ప్లాన్‌తో.. ఆయన్ని తరలించి.. ఆయన్ను ప్రిపేర్‌ చేసినట్లు చెబుతున్నారు.

అధికారులు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి? వాటికి ఎలా సమాధానం చెప్పాలి? జైలు జీవితం ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఉండే మానసిక ఒత్తిడి లాంటి అంశాలపై ఆయన్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారని చెబుతున్నారు. ఇందుకోసం మానసిక వైద్యుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఆయన రెఢీ అయ్యారని అనుకున్న తర్వాతే.. తనను ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రెఢీ అంటూ ప్రకటన చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో ఒక యువనేత అరెస్ట్‌కు ముందు కూడా ఇలాంటి కసరత్తే జరిగిందన్న వాదన వినిపించటం తెలిసిందే.

Tags:    

Similar News