• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ ఇసుక కష్టాలు ఇంకా...

ఏపీ ఇసుక కష్టాలు ఇంకా తీరడం లేదా ?

By - Tupaki Desk
Update: 2021-03-22 10:30 GMT
అధికారపార్టీ నేతలకు ఈ విషయమే అర్ధం కావటంలేదు. ఇసుక రీచులు, అమ్మకం లాంటి అనేక అంశాలను సరైన మార్గంలో పెట్టడంలో ప్రభుత్వం ఫెయిలైనట్లే అనుకోవాలి. గృహనిర్మాణాలకు లేదా ఇతరత్రా అవసరాలకు ఇసుక దొరకక జనాలు నానా అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో లారీ ఇసుక లేదా ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలంటే మధ్య తరగతి జనాలకు చుక్కలు కనబడుతున్నాయి. లారీ ఇసుక ధర అనధికారికంగా సుమారు 15-25 రూపాయల మధ్య ఉందని జనాలు చెప్పుకుంటున్నారు.

నిజానికి ప్రకృతి సిద్ధంగా దొరికే ఇసుక అమ్మకాలను మొదలుపెట్టింది చంద్రబాబునాయుడు. అప్పట్లో చెప్పింది డ్వాక్రా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని. కానీ ఆర్ధికంగా బలోపేతమైంది టీడీపీ నేతలే అన్న విషయం తెలిసిందే. ఉచితంగా లభించే ఇసుక నుండి కూడా అప్పట్లో టీడీపీ నేతలు కోట్ల రూపాయల దోచేసుకున్నారు.  ఈ విషయంలో పార్టీ, ప్రభుత్వంలోనే పెద్ద గొడవలయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన అంశాల్లో ఇసుక వ్యాపారం కూడా ఒకటి.

మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక వ్యాపారాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారని అందరు అనుకున్నారు. ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం దారుణంగా విఫలమైంది. టీడీపీ హయాంలోని ఆరోపణలే ఇపుడు కూడా కంటిన్యు అవుతున్నాయి. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకు ఇసుక రీచులన్నవి కల్పతరువులాగ తయారైందనే ఆరోపణలు మరింతగా పెరిగిపోయింది. దాంతో ఇసుక వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది.

ఇలాంటి తలనొప్పులను వదిలించుకునేందుకు ప్రభుత్వం మొత్తం రీచులను కాంట్రాక్టు పద్దతిన ఢిల్లీలోకి జయప్రకాశ్ వెంచర్స్ కు అప్పగించింది. వెంటనే జయప్రకాశ్ వెంచర్స్ పైన కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు  మొదలు పెట్టేశాయి. సరే టీడీపీ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జగన్ ఏమి చేసినా, ఏమీ చేయకపోయినా ఆరోపణలు చేయటమే పనిగా పెట్టుకుంది. టీడీపీ ఆరోపణలను వాళ్ళకు మద్దతిచ్చే మీడియా తప్ప మామూలు జనాలు అసలు పట్టించుకోవటమే లేదు. కాకపోతే జనాలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని జగన్ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా ఇసుక సరఫరాను స్ట్రీమ్ లైన్ చేస్తే జనాలు సంతోషిస్తారు.
Tags:    
  • Sand Issues 
  • Andhra Pradesh 
  • Sand 
  • Telugu News 

Similar News

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

28 ఏళ్లుగా ప్రపంచ పాదయాత్ర.. 50 వేల కిలోమీటర్లు నడిచిన బ్రిటిష్ సాహసికుడు!

2026-11-02 03:59 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

బాబు ఒక్క ఫోన్ కాల్ తో విజయ్ డీకే ఓకే

2026-11-02 03:53 GMT

ప్రతిపక్షమంతా ఒక్కటిగా...మోడీ షా టార్గెట్ గా !

2026-11-02 03:50 GMT

జగన్ రెడీ అయినట్లేనా ?

2026-11-02 03:48 GMT

సింగిల్స్‌కు ఉచితంగా ఫిన్‌ల్యాండ్ ప‌ర్యట‌న‌కు ఛాన్స్

2026-11-02 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS